- కారు జోరు ప్రచార హోరు
- కెసిఆర్ బీమాతో ప్రతి ఇంటికి ధీమా
- సౌభాగ్య లక్ష్మితో మహిళలకు భరోసా
- కారు గుర్తుకు ఓటేద్దాం, అభివృద్ధిని కొనసాగిద్దాం
- బిఆర్ఎస్ శ్రేణులు విస్తృత ప్రచారం
మన్యం న్యూస్ మణుగూరు:
మణుగూరు మండల,పట్టణ పరిధిలోని వార్డులలో బిఆర్ఎస్ శ్రేణులు ఇంటింటికి విస్తృత ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి,సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. బిఅర్ఎస్ పార్టీ మేనిఫెస్టో కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు.బిఆర్ఎస్ అధికారం లోకి రాగానే కెసిఆర్ బీమాతో ప్రతి ఇంటికి ధీమా కల్పిస్తామన్నారు.సౌభాగ్య లక్ష్మి పథకంతో మహిళలకు భరోసా కల్పిస్తామనీ, దివ్యాంగులకు పెన్షన్ 4 వేల నుండి 6 వేల కు పెంపు,ఆసరా పింఛన్లను 3 వేల నుండి 5 వేలకు పెంచుతామన్నారు. రైతుబంధు 10 వేల నుండి 16 వేలకు పెంచడం జరుగుతుందన్నారు.బిఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలను, మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ,అభివృద్ధి సంక్షేమ ప్రభుత్వానికి అండగా నిలవాలన్నారు. మణుగూరు మండల పట్టణంలోని వీధులని సిసి రోడ్లు,డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టడం జరిగింది అన్నారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు మణుగూరులో జరుగుతున్నాయని వారు తెలిపారు.జరుగుతున్న అభివృద్ధిని కార్యక్రమాలను చూసి ఓటు వేయాలన్నారు. బిఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి,ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావును భారీ మెజారిటీతో గెలిపించాలని వారు ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు,పార్టీ ముఖ్య నాయకులు,అనుబంధ సంఘాల నాయకులు,బూత్ కోఆర్డినేటర్లు,100 ఓట్ల బూత్ ఇన్చార్జీలు,యువజన నాయకులు,మహిళా కార్యకర్తలు,సోషల్ మీడియా తదితరులు పాల్గొన్నారు.