మన్యం న్యూస్ ,పినపాక :మండలంలోని తోగ్గూడెం పంచాయితీ గోవిందాపురం గ్రామానికి చెందిన కలం చిన్ని (55),ఆర్థిక ఇబ్బందులతో బలవన్మరణానికి పాల్పడ్డారు. దీనితో చిన్ని కుటుంబ గడవడం కష్టంగా మారింది. ఈ విషయం విషయం తెలుసుకున్న తో గూడెం ఎంపీటీసీ చింతపంటి సత్యం చిన్ని కుటుంబాన్ని పరామర్శించారు. క్షణికావేశంలో చిన్ని తప్పుడు నిర్ణయం తీసుకోవడం వల్ల కుటుంబం పెద్దదిక్కు కోల్పోయిందన్నారు .దశ దిన కర్మలకు గాను 50 కేజీల బియ్యాన్ని వితరణగా ఇచ్చారు చిన్ని కుటుంబానికి బి ఆర్ ఎస్ పార్టీ ఎల్లపుడు అండగా ఉంటుందని అన్నారు.ఎలాంటి సమస్యలున్న తమ దృష్టి కి తీసుకు రావాలన్నారు. పరిష్కార మార్గానికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో గొగ్గల బజారు, తోలెం నరసింహారావు, రామారావు, తదితరులు పాల్గొన్నారు.