- గుండాల, ఆళ్లపల్లి రూపురేఖలు మార్చిన ఘనత రేగా కాంతారావు దే
- కోట్ల రూపాయల నిధుల తో బీటీ రహదారులు,
- హై లెవెల్ వంతెనల నిర్మాణం
- మైదాన ప్రాంతాలకు దీటుగా ఆ రెండు మండలాల అభివృద్ధి
- రేగా చొరవతో ప్రతి పల్లె ప్రగతి పదమే
- పోడు భూములకు పట్టాలిప్పించా
- మళ్లీ ఆశీర్వదిస్తే పెండింగ్ పనులు పూర్తి చేస్తా
- బీఆర్ఎస్ పార్టీ పినపాక అభ్యర్థి రేగా కాంతారావు
*మన్యం న్యూస్ గుండాల*: పినపాక నియోజకవర్గం లో అతి మారుమూల మండలాలు ఆళ్లపల్లి, గుండాల. గత పాలకుల నిర్లక్ష్య వైఖరి మూలంగా ఆదివాసి గిరిజన ప్రాంతం పూర్తిగా వెనుకబాటు తనానికి గురైంది . రేగా కాంతారావు అనే వ్యక్తి ఎమ్మెల్యే అయ్యే అంతవరకు ఆ మండలాలను పట్టించుకున్న నాథుడే లేరు . నిధులపరంగా ఎంతో వంచనకు గురయ్యేవారు . సరియైన రహదారి సౌకర్యాలు లేక అనునిత్యం దినదిన గందంగా గడుపుతూ జీవనం వెళ్లదీసేవారు . భారీ వర్షాలు పడి వాగులు వంకలు పొంగి ప్రవహిస్తే బయటి ప్రపంచంతో వారికి సంబంధాలు కట్ అయ్యేవి . అలాంటి చీకటి రోజులు అనుభవించిన ఉమ్మడి గుండాల మండలం ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఒక యజ్ఞంలా చేసిన అభివృద్ధి పనుల మూలంగా వారి కష్టాలు తొలగిపోయాయి . మైదాన ప్రాంతాలతో ఆళ్లపల్లి గుండాల మండలాలు పోటీ పడుతున్నాయి అంటే రేగా కాంతారావు భగీరథ ప్రయత్నం చేస్తేనే నేడు ఆ మండలాల రూపు రేఖలు మారిపోయాయి *మన్యం న్యూస్ ప్రత్యేక కథనం* గుండాల, ఆళ్లపల్లి మండలాలలో కోట్ల రూపాయలతో విప్ రేగా కాంతారావు అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేశారు. గతంలో ఉన్న గుండాల, ఆళ్లపల్లి మండలాల పరిస్థితి , ప్రస్తుత ఉమ్మడి గుండాల అభివృద్ధిని ప్రజలను భేరీజు వేసుకుంటున్నారు. గతంలో రెండు మండలాలకు నిత్యం రహదారి సౌకర్యాలు లేక ప్రజలు నరకం అనుభవించారు.విప్ రేగా చొరవ తో రహదారులకు మహర్దశ పట్టింది. గతంలో మండల కేంద్రంతో పల్లెలకు సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో ప్రజలు నరకప్రాయం అనుభవించేవారని…. వర్షాకాలం వచ్చిందంటే ఎన్ని సమస్యలు ఉండేవో నాకంటే ఎక్కువ స్థానికంగా ఉండే మీకే బాగా తెలుసు అని రేగా కాంతారావుఅన్నారు అలాంటిది గుండాల, ఆళ్లపల్లి మండల కేంద్రాల నుండి పల్లెలకు క్షణాలలో వెళ్లే విధంగా రహదారి సౌకర్యం కల్పించానని దాన్ని ప్రజలు గమనించాలని కోరారు. వీటితోపాటు అంతర్గత రహదారులు ఎంత అద్వానంగా ఉండే అది కూడా మీకు తెలుసని కోట్ల రూపాయలతో ప్రతి పల్లెలలో అంతర్గత సిసి రహదారులను వేసిన ఘనత నాదేనని అన్నారు. గతంలో కొమరారం నుండి శేట్టుపల్లి రావాలంటే ప్రజలు కాలిబాటన వచ్చేవారని అలాంటిది పోసారం నుండి చెట్టుపల్లి వరకు బిటి రహదారిని కల్పించాలని ప్రజలు దీన్ని గుర్తించాలని అన్నారు. గతంలో పాలకులు ఎందరో గుండాల ఆళ్లపల్లి మండలాలకు వచ్చి హామీల వర్షాన్ని కురిపించారే తప్ప ఆచరణలో ఏదైనా చూపారని అన్నారు. గుండాల మండలంలోని కిన్నెరసాని, మల్లన్న వాగు, దున్నపోతుల వాగు, పిట్టతోగు వాగులపై వంతెనలను నిర్మించారని ఈ మధ్యనే మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న మట్టం లంక గ్రామానికి వంతెనతోపాటు రహదారి సౌకర్యాన్ని కూడా కల్పించానని అన్నారు. గతంలో ఈ గ్రామానికి ఎందరో నాయకులు హామీలు ఇచ్చారు తప్ప పనిచేయలేదని గుర్తు చేశారు. గుండాల ఆళ్లపల్లి మండలాలలో నూతనంగా కస్తూరిబా పాఠశాలను మంజూరు చేసి పూర్తి చేశానని గుండాల స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో నూతనంగా రెండు భవనాలను మంజూరు చేసి ఒకటి పూర్తి చేయించాలని మరొకటి త్వరలోనే పూర్తి అవుతుందని అన్నారు. ఎక్కడ లేని విధంగా గుండాల మండలానికి ఏకలవ్య పాఠశాలను మంజూరు చేయించేందుకు ఎంతో కృషి చేశానని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే ఉమ్మడి మండలంలో అనేక పనులను పూర్తి చేశాను మరికొన్ని పనులు జరుగుచున్నావని ప్రజలు దీన్ని ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. పోడు సమస్య పెద్ద ఎత్తున ఈ రెండు మండలాల్లో ఉంటే జిల్లాలో ఎక్కువ శాతం పోడు పట్టాలు గుండాల ఆళ్లపల్లి మండలాలకు ఇచ్చారని వాటి రావటం కోసం తన పాత్ర ఎంతో మీకు తెలుసని అన్నారు. మరో మారు ఉమ్మడి గుండాలను అభివృద్ధి చేసిన తనను గెలిపించాలని అభివృద్ధి అంటే కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మళ్లీ పాత రోజులు వస్తే అభివృద్ధి సంక్షేమం కుంటుపడుద్దని ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని రేగా విజ్ఞప్తి చేశారు.