- బీఆర్ఎస్ మ్యానిఫెస్టోతో ప్రతిపక్షాలలో వణుకు
- బీఆర్ఎస్ తోనే అందరికీ న్యాయం
- సీఎం కేసీఆర్ నాయకత్వమే తెలంగాణ ప్రజలకు శ్రీరామరక్ష :ప్రభుత్వ విప్ రేగా
మన్యం న్యూస్, అశ్వాపురం: మండల పరిధి మల్లెలమడుగు గ్రామపంచాయతీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు స్థానిక బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొని ఈనెల 30 తేదీనాడు జరిగే అసెంబ్లీ ఎన్నికలలో ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఆయన కోరారు.తొలిత మహిళలు స్థానిక ప్రజలు మంగళ హారతులతో వారికి ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోతో తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ ఇచ్చిన భరోసాని ఆయన అన్నారు, రాష్ట్రంలో పదేళ్ల కాలంలోనే చేసి చూపించిన నేత సీఎం కేసీఆర్ గారిని అన్నారు. దేశంలో ఇంటింటికి మంచినీళ్లు ఉచిత విద్యుత్ కళ్యాణ లక్ష్మి రైతుబంధు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అన్నారు.రైతులకు 35వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన ఏకైకే రాష్ట్రం తెలంగాణ అన్నారు గత ఎన్నికలలో ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేర్చడంతో పాటు అదనంగా మరిన్ని పథకాలను ప్రవేశపెట్టి అర్హులైన వారందరికీ అందజేస్తున్నామన్నారు.దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు అవుతున్నాయని ఆయన అన్నారు.అందరికీ సన్న బియ్యం పంపిణీ చేసే అన్నపూర్ణ పథకం ఆసరా పెన్షన్ 5016 దివ్యాంగులకు 6000 పెన్షన్ పెంపు రైతుబంధు 16 వేలకు అగ్రవర్ణ పేదలకు గురుకులాలు కేసీఆర్ ఆరోగ్య రక్షణకు 15 లక్షలు గ్యాస్ సిలిండర్ 400 మహిళ సమైక్యలకు సొంత భవనాలు గృహలక్ష్మి హామీలను ఇంటింట ప్రచారం చేసి వివరిస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ పై ప్రజలకు ఉన్న భరోసా కు నిదర్శనం అన్నారు.దళిత అభ్యున్నతే లక్ష్యంగా దేశంలోనే ఎక్కడలేని విధంగా సీఎం కేసీఆర్ తెలంగాణలో దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నారని గుర్తు చేశారు.ఎస్సీల కోసం పదిలక్షలు విలువైన యూనిట్లను పూర్తిగా ఉచితంగా మంజూరు చేస్తూ వారికి జీవనోపాధి కల్పిస్తున్నారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కోడి అమరేందర్,స్థానిక సర్పంచ్ కృష్ణవేణి ,కోడి గంగన్న ,గుంపెన శ్రీనివాస్ ,ఇసంపల్లి పుల్లారావు ,మంద హుస్సేన్ ,మంగళగిరి రామకృష్ణ ,మండల నాయకులు యువజన నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.