మన్యం న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 16: అశ్వారావుపేట నియోజకవర్గం కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఉప్పల వెంకటరమణ, మాట్లాడుతూ, ఈనెల 13న జరిగిన కేసీఆర్ బహిరంగ సభకు భారీగా తరలివచ్చి విజయవంతం చేసిన నియోజవర్గ ప్రజలకు కార్యకర్తలు నాయకులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి అంటే కెసిఆర్ తోనే సాధ్యమని కేంద్ర ప్రభుత్వం ఇతర దేశాల నుంచి పామాయిల్ దిగుమతి చేస్తూ మన రాష్ట్ర పామాయిల్ రైతులను మోసం చేస్తూ వస్తుందని పామాయిల్ రైతులు మోసపోకుండా ఉండాలంటే కెసిఆర్ మళ్లీ మూడోసారి సీఎం కావాలని రాష్ట్ర అభివృద్ధి సీఎం కేసీఆర్ తోనే సాధ్యమని కెసిఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను మీ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.