మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం టౌన్:
ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధి పనిచేస్తూ సేవలు అందించే పాత్రికేయులు అభినందనీయులు అని మోడ్రన్ ఇఖ్రా స్కూల్ కరస్పాండెంట్ షేక్ అబ్దుల్ బాసిత్ అన్నారు. గురువారం స్థానిక రామవరం సుభాష్ చంద్రబోస్ నగర్ లోని మోడ్రన్ ఇఖ్రా స్కూల్ లో జాతీయ పత్రిక దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ దేశ రక్షణ కోసం దేశ సరిహద్దులలో మిలటరీ వారు ప్రజల పక్షాన నిలబడి న్యాయం ధర్మం కోసం కలంతో పోరాడేవారు పాత్రికేయులని అన్నారు. దేశంలోని సమస్యలకు పరిష్కారం చూపుతూ విద్యార్థులకు తమ చదువుల్లో ముందుకు సాగే మార్గం చూపుతూ క్రీడాకారులకు ఆటల్లో మెలుకువ నేర్పుతో ఆరోగ్యం ఆనందం కోసం సూచనలు చేస్తూ ఇలా ప్రతి సమస్యను పత్రికలు అవగాహన కల్పిస్తూ సమాజ సేవ చేస్తున్నాయి అన్నారు.
కాలానుగుణంగా అనేక మార్పులు వచ్చినా పత్రికల ఆదరణ తగ్గలేదని కాని నేటి యువతలో పఠనాసక్తి తగ్గడం బాధాకరం అన్నారు. విద్యార్థులు ప్రతి రోజూ ఏదో ఒక పత్రిక చదవాలని కోరారు. ఎన్నో కష్టనష్టాలను భరిస్తూ తక్కువ వేతనాలతో పాత్రికేయులు సమాజం సేవ చేస్తున్నారని ప్రభుత్వం సమాజం అలాంటి పాత్రికేయులకు అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అధ్యాపకురాలు పర్వీన్ సుల్తానా, టీచర్లు నీలా, నసీమా సరస్వతి, ఖాజా విద్యార్థులు అమీనా నస్రీన్, నష్రా తదితరులు పాల్గొన్నారు.