మన్యంన్యూస్ ఇల్లందురూరల్:- ఇల్లందు మండల పరిధిలోని చల్ల సముద్రం, ధనియాలపాడు, ఒడ్డుగూడెం, రేపల్లెవాడ గ్రామ పంచాయతీలలో గల పోలింగ్ కేంద్రాలను ఇల్లందు ఎంపిడిఓ బాలరాజు సందర్శించారు. పోలింగ్ స్టేషన్స్ యందు టాయిలెట్స్, విద్యుత్ సౌకర్యం, మంచినీటి వసతి, మూడు చక్రాల సైకిల్ ర్యాంపు ను అందుబాటులోకి తేవటం, పోలింగ్ స్టేషన్ల పరిసరాల పరిశుభ్రత మొదలైన సౌకర్యాలన్నీ సక్రమంగా ఉండేలా చూడాలంటూ గ్రామపంచాయితీ సిబ్బందిని ఆదేశించారు. అదే విధంగా గ్రామ పంచాయతీలలో హరితహారం పనులను సమీక్షించారు. నర్సరీ లలో మొక్కల పెంపకం నిమిత్తం కావలసిన ఎర్రమట్టి, ఎరువులతో తగుమొత్తంలో కావలసిన విత్తనాలు, నీటి వసతి సమకూర్చుకోవాలని అన్నారు. నర్సరీ పరిసర ప్రాంతాలలో పశువులు వంటివి రాకుండా కంచె ఏర్పాటు చేసుకోవాలని పంచాయతీ కార్యదర్శులకు సూచన చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు మోహన్, హర్శిని, మౌనిక, స్కూల్ స్టాఫ్, పంచాయితీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.