- ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చా
- ప్రతి గ్రామంలో పూలతో ఘన స్వాగతాలు తెలిపిన మహిళలు
- ప్రచారం జనసంద్రోహం, వందలాది ద్విచక్ర వాహనాలతో కార్యకర్తల సందడి
మన్యం న్యూస్, దమ్మపేట, నవంబర్, 16: అశ్వరావుపేట నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు గురువారం దమ్మపేట మండలంలో పలు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా కార్యకర్తలు వందలాది ద్విచక్ర వాహనాలు కార్లతో ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రచారంలో ఇటీవలే వివిధ పార్టీల నుండి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న ముఖ్య నాయకులు, తాటి వెంకటేశ్వర్లు, వగ్గెల పూజ భూక్య ప్రసాద్, సోయం వీరభద్రం, బానోత్ పద్మ లు మెచ్చా ప్రచారంలో పాల్గొని తెలంగాణ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను తెలియజేస్తూ మేనిఫెస్టోను ప్రజలకు వివరించి కారు గుర్తుకే ఓటు వేసి మెచ్చాని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. దమ్మపేట మండలంలోని ఆర్లపెంట, లంకలపల్లి, అంకంపాలెం, కొత్తూరు, పాకల గూడెం, పార్కుల గండి, చిల్లగుంపు, పట్వారి గూడెం, సుధా పల్లి, ఎర్రగుంపు, కోడిసిలగూడెం, చెన్నువారిగూడెం, తాటిమల్లప్ప గుంపు, గురవాయిగూడెం, బూరుగుంపు, జగ్గారం, దిబ్బగూడెం, బాలరాజు గూడెం, గండుగులపల్లి, దురదపాడు, రెడ్యాల పాడు, ముకుందాపురం, తొట్టి పంపు, మల్లమ్మ గుంపు తదితర గ్రామాల్లో ఎమ్మెల్యే మచ్చా నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని ప్రజలకు గుర్తు చేస్తూ 24 గంటల ఉచిత కరెంటు, రైతుబంధు లాంటి ఎన్నో పథకాలు అందించిన విషయం అందరికీ తెలిసిందే అవన్నీ కొనసాగాలంటే మరలా బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని కాబట్టి ప్రతి ఒక్క ఓటర్ కూడా కారు గుర్తు పై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థి మచ్చా ప్రజలను వేడుకున్నారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో వందలాది కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది, వారందరికీ బీఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఎమ్మెల్యే మెచ్చా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి, ఎంపీటీసీలు, సర్పంచులు, బీఆర్ఎస్ మండల నాయకులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.