UPDATES  

 కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాందాస్ నాయక్ విస్తృత ప్రచారం అపూర్వ స్వాగతం పలికిన ప్రజలు..

 

మన్యం న్యూస్: జూలూరుపాడు, నవంబర్ 26, వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాలోత్ రాందాస్ నాయక్ గురువారం మండలంలోని వివిధ గ్రామాలలో విస్తృత ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల పరిధిలోని కొమ్ముగూడెం గ్రామ పంచాయితీలో మొదలైన ప్రచార కార్యక్రమం కరి వారిగూడెం, చింతల తండా, బేతాలపాడు, గుండ్లరేవు గ్రామపంచాయతీలలో గల అన్ని గ్రామాలలో ఉత్సాహంగా కొనసాగింది. ఆయా గ్రామాల ప్రజలు ప్రచార రథానికి ఎదురేగి పూలమాలలు, హారతులతో అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అభ్యర్థి రాందాస్ నాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతుందని, అందరి కష్టాలు తీరుతాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల గూర్చి వివరించారు. ప్రతి ఒక్కరూ హస్తం గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో తనను గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో టిడిపి, సిపిఐ నాయకులు పాల్గొని తమ మద్దతును తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు లేళ్ళ వెంకటరెడ్డి, కొమ్మినేని పాండు, దుద్దుకూరి మధుసూదనరావు, లాలూ నాయక్, అరెం రామయ్య, ఎల్లంకి కృష్ణయ్య, మంగీలాల్ నాయక్, దుద్దుకూరి సుమంత్, చండ్ర నరేంద్ర కుమార్, గుండెపిన్ని వెంకటేశ్వర్లు, ఎస్.కె నాగుల్ మీరా, సర్పంచులు శాంతి లాల్, శాంతిరాం, రాందాస్ నాయక్ తోపాటు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

 

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !