మన్యం న్యూస్ దుమ్ముగూడెం నవంబర్ 16::
మండలకేంద్రం లక్ష్మీ నగరం లో బి ఆర్ ఎస్ భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అభ్యర్ధి డాక్టర్ తెల్లం.వెంకట్రావు గెలుపుని కాంక్షిస్తూ ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు గురువారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మండల కేంద్రం లక్ష్మీనగరం ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న వ్యాపార దుకాణాల వద్దకు వెళ్లి దుమ్ముగూడెం మండల వాసి స్థానికుడు విద్యావంతుడు పేదల డాక్టర్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావు కారు గుర్తుకి ఓట్లు వేసి అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని ఓటును అభ్యర్థించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు అన్న సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం అనేక రకాల పథకాలు తెచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో ప్రథమ స్థానంలో నిలిపిన కేసీఆర్ కి ఓటు వేసి ఆయన పాలనకు మద్దత్తు తెలుపలని కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో డాక్టర్ తెల్లం వెంకట్రావుకి ప్రజల నుండి విశేషంగా మద్దతు ఆదరణ లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేసు, జడ్పిటిసి తెల్లం సీతమ్మ,ప్రధాన కార్యదర్శి కణితిరాముడు, అధికార ప్రతినిధి ఎండీ జానీ, ఎంపిటిసి తిరుపతి రావు తదితరులు పాల్గొన్నారు.