- బీఆర్‌ఎస్‌లోకి భారీ చేరికలు
- మూడు గ్రామాల నుండి వంద కుటుంబాలు
- బీఆర్‌ఎస్‌లో చేరిక..
- మదన్ లాల్ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్ కార్యకర్యలు.
మన్యం న్యూస్,కారేపల్లి:
కారేపల్లి మండలంలోని మాధారం,మంగలి తండా,భాగ్యనగర్ తండా గ్రామాలకు చెందిన 100 వంద కాంగ్రెస్ కుటుంబాలు గురువారం బీఆర్‌ఎస్ అభ్యర్ధి మదన్ లాల్ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.అభిమానంతో పార్టీలో చేరిన వారందరికీ స్వాగతం పలుకుతూ గులాబీ కండువాలు కప్పారు. సమర్థవంతమైన నాయకత్వాన్ని కోరుకుంటూ, పార్టీలోకి వచ్చిన ద్వితీయ శ్రేణి నాయకత్వానికి నేనున్నానంటూ మదన్ లాల్ భరోసా ఇచ్చారు.ప్రచార కార్యక్రమంలోనే వివిధ గ్రామాల నుంచి పార్టీలో చేరికలు కూడా ఇతర గ్రామాల నుంచి వచ్చి చేరడంతో బీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది.