- అభివృద్ధి సంక్షేమాన్ని చూసే బిఆర్ఎస్ పార్టీలో చేరికలు
- బిఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి…
- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
మన్యం న్యూస్,కరకగూడెం: మండల పరిధి చిరుమళ్ళ గ్రామపంచాయతీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ , పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు సమక్షంలో అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు 20 కుటుంబాలు బిఆర్ఎస్ లో చేరారు.ఈసందర్భంగా ఆయన వారికి గులాబీ కండువా లు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని ఆయన అన్నారు, తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు ఆకర్షితులే కాంగ్రెస్ పార్టీ నుంచి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారన్నారు, మూడోసారి సీఎం కేసీఆర్ కే పట్టం కట్టేదందుకు యావత్ ప్రజానీకం సిద్ధంగా ఉన్నదని అన్నారు.