మన్యం న్యూస్: జూలూరుపాడు, నవంబర్ 16, ఎన్నికల నగర మోగిన నాటి నుండి మండల వ్యాప్తంగా వివిధ హోదాలలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు వరసగా కారు దిగి హస్తం గూటికి చేరికల పర్వం నిరంతరాయంగా కొనసాగుతోంది. ఇప్పటికే మండలానికి చెందిన పలువురు ముఖ్య నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా, తాజాగా బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు, కాకర్ల ఎంపిటిసి, పొన్నెకంటి సతీష్ కుమార్, సిపిఎం మండల కార్యదర్శి, సొసైటీ వైస్ చైర్మన్ చీమలపాటి బిక్షం, కాకర్ల సర్పంచ్ రమాదేవి, పాపకొల్లు మాజీ ఎంపీటీసీ రోకటి సురేష్, సర్పంచ్ లక్ష్మి తోపాటు వారి అనుచరులు, వైరా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాందాస్ నాయక్, జిల్లా సీనియర్ నాయకులు, సొసైటీ చైర్మన్ లేళ్ళ వెంకటరెడ్డి సమక్షంలో గురువారం కాంగ్రెస్ పార్టీ లో చేరారు. వీరికి రాందాస్ నాయక్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాందాస్ నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులను కంటికి రెప్పలా కాపాడు కుంటామని తెలిపారు. కార్యక్రమంలో మాలోత్ మంగీలాల్, ఎంపీటీసీ దుద్దుకూరి మధుసూదన రావు, సొసైటీ డైరెక్టర్ కొమ్మినేని పాండురంగారావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు నున్నా రంగారావు, నర్మినేని పుల్లారావు, వేల్పుల నరసింహారావు, పోతురాజు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.