మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
మాజీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా ఉండే ఊకంటి గోపాలరావు మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు శిబిరంలో చేరడంతో చర్చ నియాశంగా మారింది. ఊకంటి గోపాలరావు తన అనుచరులతో కలిసి పాల్వంచ పెద్ద గుడి దగ్గర జలగం వెంకట్రావును శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు పెద్దమ్మ తల్లి దేవాలయంలో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరుపున కొత్తగూడెం నియోజకవర్గంలో పోటీలో ఉన్న జలగం వెంకట్రావుకు ఉకంటి గోపాలరావుతో పాటు అతని అనుచరులు మద్దతు తెలపడంతో జలగంకు మరింత బలం పెరిగింది. గతంలో ఎమ్మెల్యే ఉన్న జలగం వెంకటరావు కొత్తగూడెం నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసింది. జలగం చేసిన అభివృద్ధిని చూసి అనేకమంది జలగం వెంకటరావు శిబిరానికి తరలి రావడం జరుగుతుందని కొంతమంది కిందిస్థాయి క్యాడర్ వ్యాఖ్యానించడం గమనార్హం. ఒక దశలో జలగం వెంకట్రావు పోటీలో ఉండడని ప్రచారం సైతం జరిగింది. నామినేషన్ల ప్రక్రియకు చివరి రోజు మాత్రమే ఉందనగా జలగం వెంకటరావు అదే రోజు ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుండి పోటీ చేస్తున్నట్లు ఎంట్రీ కావడం నామినేషన్ సైతం వేయడంతో రాజకీయ సమీకరణలు ఒక్కసారి మారిపోయాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొనడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కొత్తగూడెం అసెంబ్లీ ఎన్నికల పోటీలో జలగం వెంకట్రావు దిగడంతో ఆయనకు రోజురోజుకు అభిమానులు క్యాడర్ పెరగడంతో పోటీ గట్టిగా ఉంటుందని వివిధ పార్టీలకు చెందిన పలువురు రాజకీయ నాయకులు మాట్లాడుకోవడం చర్చ నియంశంగా మారింది.