మన్యం న్యూస్, మంగపేట:
నాగులమ్మతల్లి నామస్మరణ తో నాగులమ్మ ఆలయం మార్మోగింది. మండల పరిధి
వాగొడ్డుగూడెం పంచాయతీ పరిధి లో గల లక్ష్మీనర్సాపూర్ గ్రామం లో వెలిసిన శ్రీ నాగులమ్మ అమ్మవారి ఆలయం నాగుల చవితి పర్వదినం పురస్కరించుకుని శుక్రవారం తెల్లవారుజాము నుండే భక్తులతో కిటకిటలాడింది.భక్తులు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకొని ఆలయ ప్రాంగణం లో ఉన్న నాగులమ్మ పుట్ట కు , కంక నాగుల పుట్ట కు పాలు పోసి ,పసుపు కుంకుమ ల తో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.చుట్టూ ప్రక్కల ఉన్న రాజుపేట,రామణక్కపేట ,బ్రాహ్మణపల్లి,చుంచుపల్లి,వొడగూడెం ,పాలయిగూడెం ,వాగొడ్డుగూడెం తదితర గ్రామాల నుండి పెద్దసంఖ్యలో భక్తులు హాజరవడంతో ఆలయ ప్రాంగణం నిండి పోయింది . ఆలయ ప్రధానపూజారి బాడిశ రామకృష్ణ స్వామి వొచ్చిన భక్తులకు పూజలు చేసి తీర్థ ప్రసాదాలు నిర్వహించారు.