UPDATES  

 బీ ఆర్ ఎస్ 24 గంటల కరెంట్ కావాలా?కాంగ్రెస్ 3 గంటల కరెంట్ కావాలా?

  • బీ ఆర్ ఎస్ 24 గంటల కరెంట్ కావాలా?కాంగ్రెస్ 3 గంటల కరెంట్ కావాలా?
  • కాంగ్రెస్ కు ఓటు వేస్తే కష్టాలు తప్పవు
  • గ్యారెంటీలు లేనివే కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ లు
  • కాంగ్రెస్ కు ఓటు వేస్తే 3 గంటల విద్యుత్
  • రానున్నది మన కారు సర్కారే
  • ఆలోచించి ఓటు వేయండి అభివృద్ధిని కొనసాగించండి
  • ఆళ్లపల్లి మండల ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థి రేగా కాంతారావు

*మన్యం న్యూస్ ,గుండాల(ఆళ్లపల్లి)*:బీ ఆర్ ఎస్ 24 గంటల కరెంట్ కావాలా?కాంగ్రెస్ 3 గంటల కరెంట్ కావాలా? రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే కష్టాలు తప్పవని బీఆర్ఎస్ పార్టీ పినపాక నియోజకవర్గం అభ్యర్థి రేగా కాంతారావు అన్నారు. శుక్రవారం ఆళ్లపల్లి మండలంలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ కు ఓటు వేస్తే రాష్ట్రంలో మూడు గంటల విద్యుత్ అమలు చేస్తామని కాంగ్రెస్ నాయకులు చెపుతున్న నేపథ్యంలో ప్రజలు ఆలోచించి తమ అమూల్యమైన ఓటును కార్ గుర్తుకు వేయాలని ఆయన కోరారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ చెబుతున్న ఆరు గ్యారెంటీ లకి గ్యారెంటీ లేదని అలాంటిది వాళ్ల మాటలు నమ్మేది ఎలా అని అన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఎక్కడైనా ఈ పథకాలు అమలవుతున్నాయని ఆయన అన్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న రాష్ట్రాలలో ఇవ్వరు కానీ ఇక్కడ ఇస్తామని ఆరు గ్యారెంటీలతో జనాలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. సంక్షేమ అభివృద్ధి ఓకే విధంగా అమలు చేస్తున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్ ప్రభుత్వం పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కర్ణాటక నుండి కాంగ్రెస్ నాయకులు వచ్చి ఒకరు మూడు గంటలు కరెంటు ఇస్తామని ఒకరు ఐదు గంటలు కరెంటు ఇస్తామని బాహాటంగానే చెప్తున్నారని అది కూడా 24 గంటలు కరెంటు ఇచ్చే తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఐదు గంటలు కరెంటు ఇస్తామని అంటున్నారని అన్నారు. ప్రజల్లోనే వాళ్లు ఐదు గంటల కరెంటు ఇస్తామని అంటున్న నేపథ్యంలో ప్రజలే ఆలోచించి ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకోవాలని అన్నారు. కొందరు నాయకులు ప్రజలను మభ్య పెట్టేందుకు అమలు కానీ హామీలను ఇస్తున్నారని వాటిపై ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. తినపాక నియోజకవర్గం లో అనేక అభివృద్ధి కార్యక్రమాలను అన్నారు 2009లో గెలిచిన నాటినుండి 14 వరకు ఐదు కోట్ల తో వంద పడకల ఆస్పత్రిని నిర్మిస్తే గత పాలకులు దాని వైపు కన్నెత్తి కూడా చూడలేదని అన్నారు. మళ్లీ నేను 2018లో గెలిచిన తర్వాత వంద పడకల ఆసుపత్రి పై ప్రత్యేక దృష్టి సారించి ఆస్పత్రిని మళ్లీ దారిలో పెట్టానని అన్నారు. కరోనా సమయంలో ఈ ఆసుపత్రి ఎంత ఉపయోగపడిందో అది మీ ప్రజలకు తెలుసని ఆయన పేర్కొన్నారు. కరోనా సమయంలో ఏ నాయకుడు బయటికి రాలేదని కరోనా వచ్చిన ప్రతి కుటుంబానికి ఆదుకున్న వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నానని ఆయన పేర్కొన్నారు. సాగునీటి రంగానికి ముఖ్య ప్రాధాన్యత ఇచ్చి మొదటిసారి గెలిసినప్పుడే ఆళ్లపల్లి మండలానికి ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేసి కిన్నెరసాని వాగుపై నిర్మించామని అది ఈరోజు ఎంత అద్భుతంగా పనిచేస్తుందో అది కూడా స్థానిక ప్రజలుగా మీకు తెలుసని ఆయన పేర్కొన్నారు. ఆళ్లపల్లి మండలంలో అనేక నిధులను తీసుకువచ్చి అభివృద్ధి సంక్షేమాన్ని పరుగులు పెట్టించారని అన్నారు అంతర్గత రహదారులతో పాటు గ్రామాలకు ప్రధాన రహదారులను కల్పించిన ఘనత ఎవరిదో మీరే గుర్తించాలని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే ప్రతి గ్రామానికి రహదారి సౌకర్యాన్ని కల్పించాలని రానున్న రోజులలో మరింత ప్రగతి పథంలో మండలంలోని పల్లెలను నిలుపుతానని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు మరే రాష్ట్రంలోనైనా అమలవుతున్నాయని గుర్తు చేసుకోవాలని కోరారు మళ్లీ మన సర్కారే రానున్నది కనుక ఆ సంక్షేమం అలానే కొనసాగిస్తూ కొత్తగా మరికొన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నామని ఆయన పేర్కొన్నారు. మహిళలకు సౌభాగ్య లక్ష్మి కింద ప్రతినెల 3 వేల రూపాయలను ఇవ్వనున్నట్లు ఆయన అన్నారు 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ తో పాటు ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరికి సన్నబియ్యాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఇప్పటికే మనం ఐదు లక్షల రూపాయలను ఇస్తున్నామని దానిని 15 లక్షల రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. కెసిఆర్ బీమాను అమలు చేస్తామని ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఐదు లక్షల రూపాయల బీమా కవరేజ్ని ఎల్ఐసి ద్వారా ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. వృద్ధాప్య పెన్షన్ 5000 పెంచుతూ వికలాంగుల పింఛన్ 6000 రూపాయలను చేశామని అన్నారు. రైతుబంధు సాయాన్ని పదివేల రూపాయల నుండి 16వేల రూపాయల వరకు పెంచుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకొని మేనిఫెస్టో పెట్టినట్టు ఆయన సూచించారు. మైనార్టీలకు లక్ష రూపాయల సాయం బీసీలకు లక్ష రూపాయల సాయం దళితులకు 10 లక్షల రూపాయల దళిత బందును అమలు చేస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని ఆయన అన్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని ప్రజలు ఆశీర్వదించి మళ్లీ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని తీసుకువస్తే తెలంగాణ రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకుపోతామని హామీ ఇచ్చారు. ప్రజలు ఎన్నికల టైం లో వచ్చే నాయకుల మాటలు వినాలి తప్ప సంక్షేమం అభివృద్ధిని ఎవరు తీసుకపోతున్నారు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. మళ్లీ మీ బిడ్డను ఎన్నికల బరిలో నిలిచానని ఆదరించి ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు నరసింహ రావు, పార్టీ ప్రధాన కార్యదర్శి బాబా, ఎంపీపీ మంజు భార్గవి, పిఎసిఎస్ చైర్మన్ రామయ్య, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు వెంకన్న, సర్పంచ్ శంకర్ బాబు, ప్రేమ కళ, నరసింహారావు, పిఎసిఎస్ డైరెక్టర్ ఆఫీస్, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !