- నియోజకవర్గ అభివృద్ధి,సంక్షేమ పథకాలను చూసీ ఓటేయ్యండి
- బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి మెచ్చా నాగేశ్వరరావు
- ప్రచారం లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే తాటి వేంకటేశ్వర్లు,వగ్గెల పూజా,సున్నం నాగమణి
మన్యం న్యూస్,అన్నపురెడ్డిపల్లి నవంబర్ 17 : అశ్వారావుపేట నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి మెచ్చా నాగేశ్వరరావు శుక్రవారం అన్నపురెడ్డిపల్లి మండల పరిధిలోని జానకీపురం గ్రామంలోని సత్తెమ్మ తల్లీ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతర పెంట్లం,రాజపురం,ఊటుపల్లి,భిమునిగుడెం,గుంపెన,మర్రిగుడెం గ్రామ పంచాయతీలలో గెలుపే దిశగా జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఆయనతోపాటు మాజీ ఎమ్మెల్యే తాటి వేంకటేశ్వర్లు,వగ్గెల పూజా,సున్నం నాగమణి ప్రచారంలో పాల్గొన్నారు.అనంతరం మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ అభివృద్ధిలో అశ్వారావుపేట నియోజకవర్గం ముందంజలో వున్నదని,ఎన్నడూలేని విధంగా గ్రామాల రూపురేఖలు మారాయని అన్నారు.బీఆర్ఎస్ పార్టీతోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని,ప్రజల అధిష్టానం మేరకే ముఖ్యమంత్రి కెసీఆర్ ఎన్నికల మేనిఫెస్టో రూపొందించారని అన్నారు.ముఖ్యమంత్రి కెసీఆర్ ఎన్నికలలో ముచ్చటగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని అన్నారు.దీనికి నిదర్శనం ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే అని అన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బోయినపల్లి సుధాకర్ రావు,ఎంపీపీ సున్నం లలిత,జెడ్పీటీసీ భారత లావణ్య, బీఆర్ఎస్ శ్రేణులు,నాయకులు,అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.