- అభివృద్ధి కొనసాగలి అంటే కారు గుర్తు కు ఓటెయ్యండి
- రేగా గెలిపే లక్ష్యం
- బీ ఆర్ ఎస్ మండల అధ్యక్షులు తెల్లంభాస్కర్
మన్యం న్యూస్ గుండాల:అభివృద్ధి కొనసాగలి అంటే కారు గుర్తు కు ఓటెయ్యండి అని బీ ఆర్ ఎస్ మండల అధ్యక్షులు తెల్లంభాస్కర్ కోరారు. బీఆర్ఎస్ పార్టీ గుండాల మండల నాయకులు శుక్రవారం మండలం పరిధిలోని కన్నాయిగూడెం, లక్ష్మీపురం గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ ప్రచారాన్ని నిర్వహించారు. రేగా కాంతారావును భారీ మెజార్టీతో గెలిపించాలని కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. అనంతరం పార్టీ మండల అధ్యక్షులు తెల్లం భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని అన్నారు. రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉండే ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు. పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు గుండాల మండలాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేశారని అన్నారు. రేగ కాంతారావు కారు గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యువజన విభాగం అధ్యక్షులు సయ్యద్ అర్జున్, పార్టీ అధికార ప్రతినిధి టి రాము,బీసీ సెల్ అధ్యక్షులు గడ్డం రమేష్, ఎస్సీ సెల్ అధ్యక్షులు నిట్ట రాములు, పార్టీ నాయకులు గడ్డం వీరన్న, గంగాధరి నాగరాజు, గుర్రం రాములు, తదితరులు పాల్గొన్నారు.