మన్యం న్యూస్,కారేపల్లి:
సింగరేణి మండలం,పేరుపల్లి గ్రామం కొత్త కెసిఆర్ కాలనీలో శుక్రవారం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం ఎమ్మెల్యే అభ్యర్థి బానోతు మదన్ లాల్ గెలుపును అకాంక్షిస్తూ,అదేవిధంగా కేసీఆర్ ని మూడోసారి ముఖ్యమంత్రి చేయాలని,బిఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం ప్రతి ఒకరు,పనిచేయాలని
సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రభుత్వ సంక్షేమ ఫలాల ను అందించారు.ఇప్పటివరకు ప్రభుత్వ లబ్ధి పొందిన ప్రతి ఒక్కరి ఆశీర్వాదం బిఆర్ఎస్ ఉంటుందన్నారు.ఈనెల 30న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేసి వైరా నియోజకవర్గము నుండి బానోత్ మదన్లాల్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించి సీఎం కెసిఆర్ కు కానుకగా ఇవ్వాలన్నారు. పేరుపల్లి గ్రామ శాఖ అధ్యక్షడు ఎండి.మౌలాలి అన్నారు.ఈ ప్రచార కార్యక్రమంలో గ్రామనాయకులు,కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.