- దళిత బంధు పైలెట్ ప్రాజెక్టు హామీ ప్రకటన చేసిన సీఎం కేసీఆర్ కి కృతజ్ఞతలు
- దళిత బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్
- దళిత బందుతో దళిత సమాజానికి అండ ఎస్సీ సెల్ అధ్యక్షులు నిట్ట రాములు
*మనం న్యూస్ గుండాల*:దళిత బంధు పైలెట్ ప్రాజెక్టు హామీ ప్రకటన చేసిన సీఎం కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలుపుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత జాతి బాంధవుడు అని ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు నిట్ట రాములు అన్నారు. శుక్రవారం మండలం పరిధిలోని తూరుబాక గ్రామంలో ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించి ఆయన మాట్లాడుతూ. దేశంలో ఎక్కడా లేని విధంగా 10 లక్షల రూపాయలతో దళిత బంధు పథకాన్ని తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే తక్కుతుందని అన్నారు. 10 లక్షల రూపాయలతో పథకం రావడంతో దళితులలో ఎంతో ముందు అడుగు పడుతుందని అన్నారు. ఇంతటి గొప్ప పథకాన్ని అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు దళిత సమాజ రుణపడి ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమం ఇప్పుడు ఈ మధ్యన ఎస్సీ సెల్ నాయకులు పాల్గొన్నారు.