- రాహుల్ జి ప్రపంచ మేధావి అంబేద్కర్ ని అవమానించడం తగునా?
- తరతరాలుగా దళితులను ఓటు బ్యాంకు వాడుకున్న కాంగ్రెస్ పార్టీ
మణుగూరు పర్యటనలో అంబేద్కర్ కు అవమానం:బీ ఆర్ ఏస్ నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు వెన్న అశోక్* మన్యం న్యూస్ అశ్వాపురం:కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ మణుగూరు పర్యటనలో భాగంగా అంబేద్కర్ కు అవమానం చేసి వెళ్లడం దళిత జాతిని కించపరచడమేనని,కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని నే,తలు గాని రాజ్యాంగ నిర్మాత పట్ల ఆయనకు చిన్న గౌరవం కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నారని పినపాక నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు వెన్నా అశోక్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.అంబేద్కర్ ఒక దళితుడనే చిన్న చూపు తో పక్కనే ఉన్న ఆయన విగ్రహం కనిపించలేదా ?గౌరవంగా ఒక పూల దండ కూడా వేయలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నదని అన్నారు.అందుకనే దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీకి మనుగడ లేకుండా పోయిందన్నారు. కనీసం రాష్ట్ర,జిల్లా కాంగ్రెస్ నాయకులు, స్థానిక అభ్యర్థికి సోయలేకుండా పోయిందన్నారు. ఇదేనా మీరు అంబేద్కర్ కి ఇచ్చే గౌరవం అని ఆగ్రహం వ్యక్తం చేశారు .దళిత సమాజం తెలంగాణ బహుజనులు అందరూ ముక్తకటంతో ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.వీరా రాష్ట్రాన్ని పరిపాలించేది , ఇలాంటి నాయకులకు , కాంగ్రెస్ పార్టీకి తగిన సమయంలో బుద్ధి చెప్తామని హెచ్చరించారు.