మన్యం న్యూస్ గుండాల: ఆళ్లపల్లి జెడ్పిటిసి కొమరం హనుమంతరావు కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొంది సగృహంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.ఈ నేపథ్యంలో ఆళ్లపల్లి మండల పర్యటనకు వచ్చిన పినపాక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే రేగా కాంతారావు శుక్రవారం జడ్పిటిసి హనుమంతరావు నివాసానికి వెళ్లి పరామర్శించారు. అధైర్య పడొద్దు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పార్టీ అధికార ప్రతినిధి కోలేటి భవాని శంకర్, మండల అధ్యక్షులు పాయం నరసింహారావు, ఎంపీపీ మంజు భార్గవి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.