*మన్యం న్యూస్ గుండాల*: పినపాక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రేగా కాంతారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీ లో పలు గ్రామాల ప్రజలు చేరారు. శుక్రవారం ఆళ్లపల్లి మండలంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న రేగా కాంతారావు ఆధ్వర్యంలో రామాంజి గూడెం, అనంతోగు, వెంకటాపురం, మర్కోడు గ్రామాల నుండి కొందరు బీఆర్ఎస్ లో చేరడంతో వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రేగా కాంతారావు నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి రేగా తోనే అభివృద్ధి సాధ్యమని పార్టీలో చేరుతున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గం నాయకులు పార్టీ అధికార ప్రతినిధి భవాని శంకర్, మండల అధ్యక్షులు పాయం నరసింహారావు, ఎంపీపీ మంజు భార్గవి, పిఎసిఎస్ చైర్మన్ రామయ్య, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు వెంకటేశ్వర్లు ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.