మన్యం న్యూస్ నూగురు వెంకటాపురం
వెంకటాపురం మండలం రాచపల్లి గ్రామంలో శుక్రవారం గొండ్వానా సంక్షేమ పరిషత్ గ్రామ కమిటీ సమీక్ష సమావేశం కనితి వెంకటకృష్ణ అధ్యక్షతనజరిగింది.ఈ సమావేశంలో, జిఎస్పి రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి దొర పాల్గొని మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్రలో బి ఆర్ ఎస్ ప్రభుత్వం దశాబ్ది కాలం పరిపాలించి ఆదివాసి నిరుద్యోగులకు ఎం న్యాయం చేసిందని ఆయన మండిపడ్డారు. ఏజెన్సీ డీఎస్సీ నోటిఫికేషన్ దశాబ్ది కాలంలో ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు,తెలంగాణ వస్తే ప్రతి ఇంటికి ఉద్యోగం వస్తుందని ప్రతి ఒక్క నిరిధ్యోగి కాలలు సహకారం అవుతాయని ఆశపడ్డ ఆశలు అడియాశలు అయ్యాయని వారన్నారు. నిరాశ పడిన నిరుద్యోగ ఆదివాసులకు , ప్రభుత్వంపై దండయాత్రకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు,ఏజెన్సీ ప్రాంతంలో 100% ఉద్యోగ అవకాశాలు కల్పించే 3 జీవో చట్టాన్ని పార్లమెంటులో చట్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు, 3 జీవోను చట్టం చేసే వరకు ఆదివాసి యువత ఉద్యమించాలని. ఆయన అన్నారు, ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నంత చదువులు చదివి ఆదివాసి నిరుద్యోగులు కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నారని బంగారు తెలంగాణలో ఆదివాసి నిరుద్యోగులకు ఏమి చేయలేదని తెలంగాణ ఉద్యమంలో ఆదివాసీ యువత కూడా ఉద్యమంలో పాల్గొన్నారనీ గుర్తు చేశారు,ఎన్నికల్లో ఏ పార్టీ గేలిచిన ఏజెన్సీ డిఎస్సి ని తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు,ఈ కార్యక్రమంలో ఆదివాసీ నిరుద్యోగులు గణేష్,అశోక్,రవి,మోహన్,గణేష్,తదితరులు పాల్గొన్నారు