మన్యం న్యూస్, వాజేడు:
మండలంలో గుమ్మడిదొడ్డి గ్రామం మోడెం కృష్ణయ్య (52) మృతి చెందారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం కొన్ని సంవత్సరాలుగా కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. కృష్ణయ్య, సమ్మక్క దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు కూలి పనిచేసి ఆడబిడ్డలకు పెళ్లిళ్లు చేసేరు,గడిచిన రెండు నెలలలో తన కుటుంబం లో డెంగ్యూ జ్వరాలు వ్యాపించడంతో ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం చేయించారు. చికిత్స కొరకు అధిక మొత్తంలో అప్పుగా అమ్యూమ్యాలు తీసుకొని వైద్యం చేయించారు, వయస్సు సహకరించక, అప్పు తీర్చలేక మనస్థాపానికి గురై కృష్ణయ్య ఇంట్లో ఎలుకల మందు నీళ్లల్లో కలుపుకొని ఆత్మహత్యయత్నం చేశారని, విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన శుక్రవారం ఉదయం ఏటూరునాగారం ప్రభుత్వ హాస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ కృష్ణయ్య మరణించారు. విషయం తెలుసుకున్న ఎస్.ఐ.వెంకటేశ్వరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణయ్య పార్థవదేహానికి సర్పంచ్ పాయం జయలక్ష్మి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుడి కుటుంబానికి రెండు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో పద్దం శ్రీరాములు, మాదరి వెంకన్న,మోడెం గోపి, బోదెబోయిన నరసింహామూర్తి,బోదెబోయిన సాగరిక, నల్లేబోయిన పార్వతి, గొర్లపల్లి రాజయ్య, కారం సత్యనారాయణ,కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.