కెసిఆర్ బీమా తో ప్రతి ఇంటికి ధీమా
అగ్రవర్ణాల పేదలకు నాణ్యమైన విద్య,వైద్యం
గడపగడపకు బిఆర్ఎస్ విస్తృత ప్రచారం
మన్యం న్యూస్ మణుగూరు:
మణుగూరు మండల,పట్టణ పరిధిలో గడపగడపకు బిఆర్ఎస్ శ్రేణులు విస్తృత ప్రచారం నిర్వహించారు. బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి,సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.రైతులకు రైతుబంధు,రైతు బీమా,24 గంటలు ఉచిత కరెంటు అందజేస్తున్న ఏకైక ప్రభుత్వం బిఆర్ఎస్ అని తెలిపారు. మహిళల సంక్షేమానికి కెసిఆర్ కిట్టు,న్యూట్రిషన్ కిట్టు,కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్, గృహలక్ష్మి వంటి పథకాలను అమలు చేయడం జరిగిందన్నారు.దళితులకు దళిత బంధు,బీసీలకు బీసీ బందు వంటి పథకాలను అమలు చేసి వారి ఆర్థిక అభివృద్ధికి బిఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేసింది అన్నారు.సీఎం కేసీఆర్ ప్రకటించిన బిఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోతో కలిగే సంక్షేమం గురించి ప్రజలకు వివరించారు. మూడోసారి బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే కెసిఆర్ బీమా పథకం ద్వారా రాష్ట్రం లోని 93 లక్షల మంది పేద కుటుంబాలకు భీమా కల్పించడం,జరుగుతుందన్నారు.అర్హులైన మహిళలందరికీ సౌభాగ్య లక్ష్మీ ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తామన్నారు. అన్నపూర్ణ ద్వారా సన్న బియ్యం,400 రూపాయలకే గ్యాస్ అందజేస్తామన్నారు. రైతు బంధు 10 వేల నుండి 26 వేలకు పెంచుతామని,ఆసరా పింఛన్లు 5వేల రూపాయలు, దివ్యాంగు లకు 6 వేల రూపాయలను అందజేస్తామని తెలిపారు.ఆరోగ్య రక్ష ద్వారా పేదలకు నాణ్యమైన వైద్యం అందిస్తామని తెలిపారు. బిఆర్ఎస్ మేనిఫెస్టో ను ప్రజలకు వివరిస్తూ,గడప గడపకు విస్తృత ప్రచారం నిర్వహించారు.మణుగూరు మండల పట్టణ పరిధిలో ప్రభుత్వ విప్ రేగా కాంతరావు కోట్ల రూపాయల నిధులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది అన్నారు. ప్రధానమైన సమస్యలకు శాశ్వత పరిష్కారం చేశారన్నారు.జరిగిన అభివృద్ధిని కార్యక్రమాలను, సంక్షేమాన్ని చూసి ఓటు వేయాలని ప్రజలను కోరారు. రాబోయే ఎన్నికల్లో మరొకసారి బిఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై ఓటు వేసి ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ స్థానిక ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు,బూత్ కో ఆర్డినేటర్లు,ఇన్చార్జిలు,యువజన నాయకులు,బిఆర్ఎస్వి నాయకులు,సోషల్ మీడియా సభ్యులు,మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.