మన్యం న్యూస్ మణుగూరు:
మణుగూరు లో ఏర్పాటుచేసిన రాహుల్ గాంధీ రోడ్ షో కు అశ్వాపురం మండలం జగ్గారం గ్రామం నుంచి జనాలను తరలిస్తున్న ట్రాక్టర్ ప్రమాదావశాత్తు తిరగబడడం తో సోడే.వెంకటేశ్వర్లు తీవ్ర గాయాలపాలై మరణించారు. మణుగూరు 100 పడకల ఆసుపత్రిలో ఉన్న వెంకటేశ్వర్లు పార్థివ దేహాన్ని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సతీమణి రేగా సుధా రాణి సందర్శించి వారికి నివాళులర్పించారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి ధైర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు,మహిళా కార్యకర్తలు,సిసి రేగా రవి, అశ్వాపురం మండల నాయకులు,యువజన నాయకులు లంకెల రమేష్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.