UPDATES  

 అవినీతికి కేరాఫ్ వనమా కుటుంబం..

  • అవినీతికి కేరాఫ్ వనమా కుటుంబం
  •  రాఘవ ఆగడాలతో కాంట్రాక్టర్లు బేజార్
  • పథకాలలో కమిషన్ల పర్వం
  • అంతులేని వనమా రాఘవ దందా
  • ఓటుతో వనమా కుటుంబానికి బుద్ధి చెప్పాలి
  • టూరిస్టులను దూరంగా పెట్టాలి
  • సిపిఐ అభ్యర్ధిని భారీ మెజారిటీతో గెలిపించాలి

 

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:

అవినీతికి కేరాఫ్ కొత్తగూడెం ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు కుటుంబం మారిందని కాంగ్రెస్ సిపిఐ సిపిఎం తర పార్టీల శ్రేణులు విరుచుకుపడ్డారు. శుక్రవారం కొత్తగూడెం పట్టణంలో టిడిపి నాయకులు కనగాల అనంత రాములు ఆధ్వర్యంలో శుక్రవారం పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సిపిఎం సిపిఐ టిడిపి నాయకులు మాట్లాడుతూ వనమా కుటుంబం ఆగడాలపై మండిపడ్డారు. ప్రజలకు సేవ చేస్తారని నమ్మకంతో గతంలో వనమా వెంకటేశ్వరరావును గెలిపిస్తే ఆయన తనయుడు రాఘవ భూ దందాలకు పాల్పడుతూ ప్రభుత్వ పథకాలలో కమిషన్లు తండుకోవడం జరిగిందన్నారు. రాఘవ ఆగడాలను ఓటర్లు గుర్తుచేసుకొని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల రంగంలో ఉన్న వనమా వెంకటేశ్వరరావు కుటుంబానికి ఓటుతో బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు. జరగబోవు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్, సిపిఎం, టీజేఎస్, ప్రజాపంథా బలపరుస్తున్న సిపిఐ నాయకుడు కూనంనేని సాంబశివరావుకు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మద్దతునిస్తుందని తెలిపారు. ఈ ఎన్నికల్లో కొత్తగూడెంలో కూనంనేని సాంబశివరావు గెలుపు ఖాయం అన్నారు. అనంతరం కూనంనేని సాంబశివరావును పలువురు శాలువా పూలమాలతో సత్కరించారు. అదేవిధంగా

సిపిఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ తాను కొత్తగూడెంలో 2009 నుండి 2014 వరకు ఎమ్మెల్యేగా ఉండి అనేక అభివృద్ధి పథకాలు తీసుకువచ్చానని అన్నారు. కానీ ఎప్పుడో ఒకసారి కొత్తగూడెం పట్టణానికి టూరిస్టుల వస్తు జనాలకు కల్లబొల్లి మాటలు చెబుతున్న నాయకుడు అభివృద్ధి అంటే నేను నేనంటేనే అభివృద్ధి అంటూ మాయ మాటలు చెప్పుకుంటూ నియోజకవర్గంలో ప్రచారాన్ని సాగించడం సిగ్గుచేటు అన్నారు. పారిశ్రామిక ప్రాంతమైన ఈ నియోజకవర్గంలో కార్మికుల సమస్యల పట్ల వారికి అందవలసిన అభివృద్ధి పథకాల పట్ల అనునిత్యం పోరాటం సాగిస్తుంది సిపిఐ పార్టీ అని పేద బడుగు బలహీన వర్గాల సమస్యలపై ఎన్నో పోరాటాలు నిర్వహించి వారి అభివృద్ధికి తన వంతుగా కృషి చేయడం జరిగిందన్నారు. కొత్తగూడెంలో బైపాస్ రోడ్డు నిర్మాణంలో తన కృషి ఎనలేనిదన్నారు. తన హయాంలోనే కేటీపీఎస్ ఏడవ దశ సైతం ప్రారంభమైందని గుర్తు చేశారు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసిన చందంగా తాను తెచ్చిన నిధులతో అభివృద్ధి జరిగితే మేము చేశామంటూ చెప్పుకోవడం దౌర్భాగ్యమన్నారు. పూటకో పార్టీలు మారే మీరు అభివృద్ధికి తోడ్పాటు పడ్డారంటే సిగ్గుచేటుగా ఉందని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాజకీయ ప్రజా సంఘాలు కార్మిక సంఘాలు అన్నింటినీ కలుపుకొని ఈ నియోజకవర్గంలో తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపిన ఘనత సిపిఐ పార్టీకి ఉందన్నారు. బయ్యారం గనులను దోచుకుపోతుంటే అక్కడ జరిగిన కుంభకోణాన్ని ఆనాడు బయటపెట్టింది తానేనని పేర్కొన్నారు. నవంబర్ 30న జరుగనున్న ఎన్నికల్లో సిపిఐ పార్టీ అభ్యర్థిగా ఉన్న తనను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిఎన్టియుసి రాష్ట్ర నాయకులు రత్నాకర్, టీజేఎస్ నాయకులు మల్లెల రామనాథం, కాంగ్రెస్ నాయకులు తూము చౌదరి, చింతలపూడి శేఖర్, సిపిఐ పార్టీ నాయకులు భాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా, కొండా స్వామి, వేణు, ఆది బాబు, శ్రీనివాస్, పెద్ద సంఖ్యలో టిడిపి శ్రేణులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !