- కాంగ్రెస్ గూటికి వనమా మేనల్లుడు కొత్వాల
- రాహుల్ గాంధీ సమక్షంలో చేరిక
- కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కొరకు కృషి
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ సొసైటీ చైర్మన్ కొత్తగూడెం ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు మేనల్లుడు కొత్వాల శ్రీనివాసరావు కాంగ్రెస్ గూటికి రావడం జరిగింది. శుక్రవారం మణుగూరు ఏరియాలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ రోడ్ షో ఉండడంతో ఆయన సమక్షంలో కొత్వాల శ్రీనివాసరావు చేరారు. బీఆర్ఎస్ లో ఉన్న కొత్వాల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో భద్రాద్రి జిల్లా కేంద్రంలో చర్చనీయాంశంగా మారింది. మాజీ ఎంపీ పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహకారంతో సొసైటీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు కాంగ్రెస్ లోకి రావడం గమనార్హం. మరి కొంతమంది బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పొంగులేటి సహకారంతో రానున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉండగా కొత్వాల శ్రీనివాసరావు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం తన వంతుగా కృషి చేస్తానని పేర్కొన్నారు.