మన్యం న్యూస్,వాజేడు:కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది.
ఇటీవలే మాజీ ఎమ్మెల్సీబాలసాని లక్ష్మీనారాయణ వెంట కాంగ్రెస్ పార్టీలో చేరిన వాజేడు మండలం కృష్ణాపురం ఎంపీటీసీ చిట్టిబాబు భద్రాచలం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తెల్లం వెంకట్రావు విజయాన్ని ఆకాంక్షిస్తూ.. ఎమ్మెల్సీ, భద్రాచలం ఎన్నికల ఇన్చార్జ్ తాతా మధుసూదన్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తాత మధు ఆయనకు టిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో వాజేడు మండలం ఎన్నికల సమన్వయకర్త బోదెబొయిన బుచ్చయ్య, వాజేడు మండలం అధ్యక్షుడు పెనుమల్ల రామకృష్ణారెడ్డి,వెంకటాపురం బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంప రాంబాబు పాల్గొన్నారు.