బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయాన్ని ఆకాంక్షిస్తూ 400 మంది కుటుంబ సభ్యులు బిఆర్ఎస్ పార్టీ చేరిక.
*సుభాష్ నగర్ కాలనీ లో కావూరి గోపి, అక్కం జ్యోతి, ప్రభావతి, రమణ, భాగ్యలక్ష్మి, సూరిబాబు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న కాలనీవాసులు…*
*సుభాష్ నగర్ కాలనీ 400 కుటుంబాలను స్వయంగా పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్సీ, భద్రాచలం ఎన్నికల ఇంచార్జ్ తాతా మధుసూదన్ *
మన్యం న్యూస్,భద్రాచలం:
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో పోటీ చేస్తున్న భద్రాచలం నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి డా.తెల్లం వెంకట్రావు ని భద్రాచలం ప్రజలు సమయస్ఫూర్తితో గెలిపించుకోవాలి ఎమ్మెల్సీ, భద్రాచలం నియోజకవర్గ వీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి తాత మధుసూదన్ అన్నారు. ప్రతిపక్ష పార్టీ అభ్యర్థుల గెలుపుతో భద్రాచల అభివృద్ధికి నష్టం జరిగిందని,
బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సాధ్యంలో ప్రజా ఆకాంక్షలను నెరవేర్చే సుపరిపాలన మన తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుందన్నారు.
భద్రాచలం అభివృద్ధి, వరద ముప్పు సమస్యకి పరిష్కారానికి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తెల్లం వెంకట్రావు విజయమే పరిష్కారం మార్గంగా భావిస్తున్నాం అని…
గత పాలకుల హయంలో కరకట్ట పొడిగింపు గురించి ఆలోచించిన నాధుడే లేడు.. వరద కష్టాన్ని చూసి చలించిన ముఖ్యమంత్రి కేసీఆర్ నిధులు మంజూరు చేసి టెండర్ ఖరారు చేశారు అని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ అధికారం చేపట్టేది బిఆర్ఎస్ ప్రభుత్వమే అధికార పార్టీ అభ్యర్థి విజయంతో భద్రాచలం సమగ్ర అభివృద్ధికి అవకాశం కలుగుతుంది..
*బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తెల్లం వెంకట్రావు విజయంతోనే భద్రాచలం అభివృద్ధికి పునాది పడుతుంది: ఎమ్మెల్సీ భద్రాచలం ఎన్నికల ఇంచార్జ్ తాతా మధుసూదన్ *
రాదనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సుసాధ్యం చేసిన ఘననీయుడు ముఖ్యమంత్రి కేసీఆర్.. తెలంగాణ రాష్ట్రంపై వారికున్న ప్రేమ అనురాగం ఆత్మీయత ఢిల్లీ టూరిస్ట్ నాయకులకు ఎలా ఉంటుంది..?
రాష్ట్రంలో అభివృద్ధితోపాటు సృష్టించిన సంపదను తెలంగాణ ప్రతి బిడ్డకు అందజేసే విధంగా సంక్షేమ సుపరిపాలనను ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో కొనసాగించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఎందుకు గ్యారెంటీ పథకాలు అమలు చేయలేక పోతుంది..? పూటకు ఓ మాట ప్రాంతానికి ఒక పాలసీతో వ్యవహరించే కాంగ్రెస్ పార్టీతో తెలంగాణకు నష్టం ..
దేశంలోనే ఎక్కడా లేని విధంగా పేదింటి ఆడబిడ్డ వివాహానికి ఆర్థిక సహాయం అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు..
దేశం గర్వించదగ్గ సంక్షేమ పాలనతో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరోదించుకున్నాము. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సొంత గ్రామంలో సైతం ఇంటింటికి నల్లాలు లేవు.. ముఖ్యమంత్రి కెసిఆర్ పుణ్యమా అని నీళ్ల కష్టాలు రాష్ట్రంలోని మహిళలందరికీ తొలగిపోయాయి.. ఒంటరి మహిళలకు, వృద్ధులకు వికలాంగులకు చేయూతనిచ్చే సుపరిపాలన కెసిఆర్ ది అని అన్నారు.
వ్యవసాయానికి పంట సహాయం అందిస్తున్న ఘనత కేసిఆర్ ది.. ఎన్నో ఏళ్ల నుండి పోరాటం చేస్తున్న గిరిజన బిడ్డలందరికీ పోడుపట్టాలించి తన గొప్పతనాన్ని చాటుకున్న ఘననీయుడు ముఖ్యమంత్రి కేసీఆర్.
భద్రాచలం నియోజవర్గ అభివృద్ధి.. భద్రాచలం రామాలయ అభివృద్ధి కేసీఆర్ బాధ్యత..
ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఉన్న దేవ భక్తి ఈ దేశంలోనే మరొకరికి లేదు.
ఈ కార్యక్రమంలో సుభాష్ నగర్ కాలనీవాసులు, కాలనీ పెద్దలు మరియు భద్రాచలం డివిజన్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.