- రాహుల్ సభ సందర్భంగా అపశృతి
- మణుగూరు కాంగ్రెస్ కార్నర్ మీటింగ్ కి వస్తుండగా ట్రాక్టర్ బోల్తా
- వ్యక్తి మృతి
మన్యం న్యూస్ అశ్వాపురం: మణుగూరులో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రాహుల్ గాంధీ కార్నర్ మీటింగ్ సందర్భంగా అపశృతి చోటుచేసుకుంది .అశ్వాపురం మండలం కల్యాణ పురం వద్ద కాంగ్రెస్ పార్టీ మీటింగు కు వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా కొట్టింది. ఈ క్రమంలో జగ్గారం గ్రామంకు చెందిన సోడే వెంకటేశ్వర్లు అనే వ్యక్తి మృతి చెందాడు. పలువురుకి గాయాలయ్యాయి. మణుగూరు 100 పడకల హాస్పిటల్ కి తీసుకువెళ్లారు.