UPDATES  

 శాసనసభ ఓట్ల లెక్కింపుకు మూడంచల భద్రత…

  • శాసనసభ ఓట్ల లెక్కింపుకు మూడంచల భద్రత
  • కేంద్రాలలో చుట్టూ సీసీ కెమెరాలు
  •  కౌంటింగ్ సిబ్బందికి అన్ని ఏర్పాట్లు
  •  పటిష్ట రక్షణలో ఈవీఎంలు
  • ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రియాంక

 

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో;

వచ్చే నెల 3వ తేదీన పాల్వంచ అనుబోస్ ఇంజనీరింగ్ కళాశాలలో జరుగనున్న శాసనసభ ఎన్నికలు

లెక్కింపుకు పకడ్బంది ఏర్పాట్లు చేయనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు.

శనివారం అనుబోస్ కళాశాలలో ఓట్లు లెక్కింపు ప్రక్రియకు చేయాల్సిన ఏర్పాట్లుపై పోలీస్, రిటర్నింగ్ అధికారులు,

ఆర్ అండ్ బి, సర్వే అండ్ లాండ్స్ రికార్డ్సు తదితర శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ

సందర్భంగా ఆమె మాట్లాడుతూ 30వ తేదీన పోలింగ్ ప్రక్రియ ముగిసిన తదుపరి ఎన్నికల సంఘ నియమావళి

మేరకు అత్యంత బద్రత మద్య ఈవియంలు బద్రపరచాలని చెప్పారు. ఈవియంలు బద్రపరచిన స్ట్రాంగు రూములో

విద్యుత్ నిలిపి వేయాలని చెప్పారు. పటిష్ట రక్షణ చర్యల్లో భాగంగా స్ట్రాంగు రూము వద్ద సిసి కెమేరాలు ఏర్పాటుతో

పాటు రికార్డు చేయు విధంగా చర్యలు చేపట్టాలని చెప్పారు. కౌంటింగ్ కేంద్రంలో రక్షణ ఏర్పాట్లు పనులు

ప్రారంభించాలని చెప్పారు. రెండంచల మెష్ ఏర్పాటు చేయాలని చెప్పారు. స్ట్రాంగు రూములో విద్యుత్ సరఫరా

నిలిపివేయాలని చెప్పారు. ఎలాంటి విద్యుత్ ప్రమాదాలకు తావు లేకుండా విద్యుత్ ఏర్పాట్లు పర్యవేక్షణకు విద్యుత్

శాఖ ఎస్ఈ నోడల్ అధికారిగా నియమించినట్లు చెప్పారు. లెకింపు విధులు నిర్వహించు సిబ్బందికి గుర్తింపు కార్డులు

జారీ చేయాలని, గుర్తింపు కార్డులు లేని వ్యక్తులను కేంద్రంలోనికి అనుమతించరని చెప్పారు. మూడంచల బద్రతా

చర్యల్లో భాగంగా బారికేడిండ్ ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బి అధికారులకు సూచించారు. స్ట్రాంగు రూము,

కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాటుకు నియోజకవర్గానికి ఆర్ అండ్ బి నుండి ఇంజనీర్లును ఏర్పాటు చేయాలని చెప్పారు.

అంతర్జాల సేవలకు ఇబ్బంది రాకుండా హై స్పీడ్ సేవలు ఏర్పాటు చేయాలని చెప్పారు. కౌంటింగ్ కేంద్రంలో

పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని, సురక్షిత మంచినీరు, మరుగుదొడ్లు వంటి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని

చెప్పారు. పారిశుద్య విధులు నిర్వహించు సిబ్బంది జాబితా పోలీసులకు అందచేయాలని మున్సిపల్ కమిషనర్కు

సూచించారు. కళాశాలలో విధులు నిర్వహించు సిబ్బంది అనుమతి కొరకు జాబితా అందచేయాలని చెప్పారు. ఈ

నెల 25వ తేదీ నుండి కళాశాలను పూర్తిగా మా ఆధీనంలోకి తీసుకుంటామని, పర్నీచర్ ఏర్పాట్లు చేయాలని

చెప్పారు. రిటర్నింగ్ అధికారులు ఓట్లు లెక్కింపు విధులు కేటాయించిన సిబ్బందికి శిక్షణా తరగతులు నిర్వహించి

సన్నద్ధం చేయాలని చెప్పారు. కౌంటింగ్ ప్రక్రియలో ఫ్లోర్ మార్కింగ్ చేయాలని ఆర్ అండ్ బి అధికారులకు

సూచించారు. అగ్నిమాపక నియంత్రణ చర్యలు చేపట్టాలని చెప్పారు. లెక్కింపు ప్రక్రియ ముగిసే వరకు విధులు

నిర్వహించు సిబ్బంది ఆవరణ విడిచి వెళ్లడానికి అనుమతి లేదని చెప్పారు. పరిశీలకులకు సీటింగ్ ఏర్పాట్లు

చేయాలని చెప్పారు. రిటర్నింగ్ అధికారులు బారికేడింగ్ ప్రణాళిక తయారు చేయాలని చెప్పారు. లెక్కింపులో

ఈవియంలు తీసుకొచ్చే సిబ్బందికి ఆయా నియోజకవర్గాల వారిగా డ్రెస్ కోడ్ ఏర్పాటు చేయాలని చెప్పారు.

ఎస్పీ డాక్టర్ వినీత్ మాట్లాడుతూ మన పోలీస్ తో పాటు కేంద్రబలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు

చేస్తున్నట్లు చెప్పారు. కేంద్రంలో 80 సిసి కెమేరాలు ఏర్పాటు ద్వారా ప్రత్యేక పర్యవేక్షణ చేయనున్నట్లు చెప్పారు. రద్దీ

నియంత్రణకు బారికేడ్లు ఏర్పాటు చేయుటకు కార్యాచరణ తయారు చేయాలని చెప్పారు. విద్యుత్ సరఫరాకు

అంతరాయం లేకుండా ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేయాలని చెప్పారు. కౌంటింగ్ కేంద్రంలో ఐరన్ మెష్ ఏర్పాటు

చేయాలని చెప్పారు. కౌంటింగ్ ప్రక్రియ ఆసాంతం వీడియో గ్రఫి చేసేందుకు సిసి కెమేరాలు ఏర్పాటు చేయాలని

చెప్పారు. కేంద్రాలను సులువుగా తెలుసుకునేందుకు వీలుగా సైన్బోర్డులను ఏర్పాటు చేయాలని చెప్పారు.

ఈ సమావేశంలో రిటర్నింగ్ అధికారులు ప్రతీక్ జైన్, రాంబాబు, శిరీష, మంగీలాల్, కార్తీక్, ఆర్ అండ్ బి

ఈఈ భీంలా, సర్వే లాండ్ రికార్డ్స్ ఏడి కుసుమకుమారి, నియోజకవర్గ కేంద్ర తహసిల్దారులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !