మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం టౌన్:
కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని మధుర బస్తిలో సిపిఐ కాంగ్రెస్ జన సమితి పొత్తులో భాగంగా కొత్తగూడెం అసెంబ్లీ నుండి పోటీ చేస్తున్న సిపిఐ అభ్యర్థి విజయాన్ని కాంక్షిస్తూ శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రతి గణపతడుతూ కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్న సంక్షేమ పథకాల గురించి వివరించడం జరిగింది. గృహజ్యోతి పథకం ద్వారాకుటుంబానికి రెండు వందల యూనిట్లు విద్యుత్ ఉచితం, ఇందిరమ్మ ఇండ్లు ఇల్లు లేని వారికి ఇంటి స్థలంతో పాటు ఐదు లక్షల వరకు ఆర్థిక సాయం ఉచిత బస్సు ప్రయాణం ఇలా ఎన్నో పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇవ్వడం జరిగిందని పేర్కొంటూ ప్రచారం చేశారు. సిపిఐ ఎమ్మెల్యే అభ్యర్థి
సాంబశివరావు అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు. మధురబస్తీ వాసులను డోర్ టు డోర్ కలిసిన వారిలో కాంగ్రెస్ సిపిఐ ముఖ్య నాయకులు మహమ్మద్ రియాజ్ మోదుగు రాధమ్మ లక్ష్మి సలోమి మంజుల తదితరులు పాల్గొన్నారు.