- హైలెవల్ వంతెన లు తెచ్చా…మీ కష్టాలు తీర్చా
- నన్ను గెలిపిస్తే పినపాక నియోజకవర్గ పైలెట్ ప్రాజెక్టు గా దళిత బంధు
- ఎన్ని రోజులు రాజకీయం చేసిన అన్నది ముఖ్యం కాదు నేటి సమాజానికి ,ప్రజలకు ఏమి చేశామన్నది ముఖ్యం
- బీ ఆర్ ఎస్ పినపాక నియోజకవర్గ అభ్యర్థి రేగా కాంత6
- అడుగడుగునా రేగాకు ప్రజలు బ్రహ్మరథం
- గతంలో మన పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి ప్రజలు ఆలోచన చేయాలి:రేగా
కరకగూడెం: మన గ్రామాలు గతంలో ఎలా ఉన్నాయి నేడు అభివృద్ధి చెంది ఎలా ఉన్నాయని చూసి ప్రజలు ఓటు వేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, పినపాక నియోజకవర్గం బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి రేగా కాంతారావు అన్నారు. ఆదివారం మండల పరిధిలోని రఘునాధపాలెం బర్లగూడెం వెంకట్రాంపురం నర్సంపేట కాలనీ మోతే తాటిగూడెం తదితర గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఆయన ప్రచారానికి వస్తున్న సందర్భంగా ప్రజలు అడుగడుగున బ్రహ్మరథం పడుతూ, హారతులు ఇస్తూ, పూలు వెదజల్లుతూ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఈనెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికలలో కారు గుర్తుకు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన తెలిపారు. గ్రామాలు మరింత అభివృద్ధి చెందాలంటే మరల బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టి మరింత అభివృద్ధికి పునాదులు వేయాలని తెలిపారు. ఈ పది రోజులు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రజలలో ఉండే గడపగడపకు మనం చేసిన అభివృద్ధి నూతన మేనిఫెస్టో చేయబోయే కార్యక్రమాలను వివరించాలని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ హామీలు ఇక నీటి మాటలే అని, వాళ్లు ఇచ్చిన ఆరు గ్యారెంటీలకి వారంటీ లేదని అన్నారు. నేటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలే కాకుండా ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకువచ్చి ప్రజలకు నూరు శాతం అందేలా కృషి చేసిందని అన్నారు. మారుమూల గ్రామాలు అభివృద్ధి చెందాలంటే మరల మూడవసారి ముచ్చటగా కెసిఆర్ సీఎం కావాలని కోరారు. అలాగే తెల్లరేషన్ కార్డు కలిగి ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి 5 లక్షలు ఎక్స్గ్రేషియా ఇస్తుందని, సౌభాగ్య లక్ష్మి కింద 18 ఏళ్లు నిండిన మహిళలకు 3000 రూపాయలు రేషన్ దుకాణాలలో సన్నబియ్యం రైతుబంధు ఆసరా పింఛన్ పెంపు వంటి వినూత్న పథకాలు కెసిఆర్ ప్రకటించారని వాటిని అధికారంలోకి రాగానే నూటికి నూరు శాతం అమలుపరుస్తారని ఆయన తెలిపారు. ఎన్ని రోజులు రాజకీయం చేసాం అన్నది ముఖ్యం కాదు నేటి సమాజానికి ప్రజలకు ఏమి చేశామన్నదే ముఖ్యమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కొమరం కాంతారావు, మండల అధ్యక్షులు రావుల. సోమయ్య, ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.