UPDATES  

 బుచ్చంపేట గ్రామంలో 50 మంది బిఆర్ఎస్ లో చేరిక…బీఆర్ఎస్ ములుగు అభ్యర్థి నాగజ్యోతికి బ్రహ్మరథం పడుతున్న పల్లె ప్రజలు..

 

మన్యం న్యూస్, మంగపేట: ములుగు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బడే నాగజ్యోతికి మండల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.

బతుకమ్మలు, మంగళ హారతులతో స్వాగతం పలుకుతూ అభిమానాన్ని చాటుకోవడం జరిగింది

మంగపేట మండలం ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను గెలిపించాలని బీఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ అభ్యర్థి బడే నాగజ్యోతి మహిళలకు, ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం మంగపేట మండలంలోని బుచ్చంపేట గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు . ఈ సందర్భంగా బడే నాగజ్యోతి మాట్లాడుతూ ఇప్పుడు జరుగుతున్న యుద్ధం పేదరాలి నైనా నాకు పెత్తందారులు, అవినీతి కాంట్రాక్టర్లకు మధ్య జరిగే సమరం అన్నారు. పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలని, ప్రజల భవిష్యత్ కు ఎన్నో మార్గాలను చూపిన ఘనత కేసీఆర్ దే అటువంటి మహానుభావుడి కి ములుగు ఎమ్మెల్యే అభ్యర్థి గా గెలిపించిన కానుక ఇచ్చి ములుగు ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి మీకు కానుక ఇస్తాను అని తెలియజేశారు. ఈ సందర్బంగా బి ఆర్ ఎస్ ముఖ్య నాయకులు మాట్లాడుతూ బడే నాగజ్యోతిని బంపర్ మెజారిటీ తో గెలిపించే బాధ్యత మనదే అని తెలియజేశారు.

బుచ్చంపేట గ్రామంలోసుమారు 50మంది కాంగ్రెస్, బీజేపీ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోగా వారికి బీ ఆర్ ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి బి ఆర్ ఎస్ పార్టీ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి ఆహ్వానించారు. ములుగు అభివృద్ధిలో పరుగు పెట్టాలంటే తమ అమూల్యమైన ఓటును కారు గుర్తుకు వేసి తనని గెలిపించాలని బడే నాగజ్యోతి కోరారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !