UPDATES  

 పోడు భూములకు పట్టాలు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే..బీఆర్ఎస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా నాయకులు వట్టం రాంబాబు దొర..

 

మన్యం న్యూస్ ,పినపాక:

పోడు భూములకు పట్టాలు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే ఆ పార్టీ జిల్లా నాయకులు వట్టం రాంబాబు, పినపాక ఎంపీపీ గుమ్మడి గాంధీ అన్నారు. ఆదివారం పినపాక మండలం లో

పోడుభూములకు పట్టాలు పొందిన రైతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశంలో వట్టం రాంబాబు మాట్లాడుతూ గిరిజనులు గత 20 సంవత్సరాలుగా పోడు భూములు సాగు చేసుకుంటున్నారని, వారికి పట్టాలు ఇచ్చిన ఘనత సీఎం కెసిఆర్ కు దక్కిందన్నారు. పోడుభూములకు పట్టాలు మంజూరు లో ఎమ్మెల్యే రేగా కాంతారావు తీవ్రంగా కృషి చేశారన్నారు .ఆ కృషిని పోడుపట్టాలు పొందిన ప్రతి ఒక్క రైతు గుర్తు పెట్టుకోవాలన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి రేగా కాంతారావును గెలిపిస్తే పోడుభూములకు త్రీ ఫేస్‌ కరెంట్‌, మోటర్లు ఉచితంగా ఏర్పాటు చేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు, గిరిజన ప్రజాప్రతితులు, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !