మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం టౌన్:
కొత్తగూడెం బీఆర్ఎస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ కొత్తగూడెం సూపర్ బజార్ సెంటర్ లో జరిగిన మంత్రి కేటీఆర్ రోడ్ షో విజయవంతమైందని
భారత రాష్ట్ర సమితి మాజీ కార్యవర్గ సభ్యులు
మోరే భాస్కరరావు తెలిపారు. సోమవారం జిల్లా భారత రాష్ట్ర సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి కేటీఆర్ రోడ్ షో కి పెద్ద ఎత్తున ప్రజల తరలివచ్చారని ఆయన ప్రసంగం ఎంతగానో ఆకట్టుకుందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రతి గడపగడపకు చేరే విధంగా చర్యలు తీసుకుందని తెలిపారు. సీఎం కేసీఆర్ పాలనను మెచ్చి వివిధ పార్టీల నుండి గులాబీ పార్టీలోకి చేరడం జరుగుతుందని వివరించారు. ముచ్చటగా మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయం అన్నారు. ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కొత్తగా ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ద్వారా అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో నిలబడిన బీఆర్ఎస్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు కారు గుర్తుపై ఓటు వేయాలని మోరే భాస్కర్ విజ్ఞప్తి చేశారు. ఈ విలేకరుల సమావేశంలో సీనియర్ బీఆర్ఎస్ నాయకులు తొగరు రాజశేఖర్, బండి రాజు గౌడ్, మల్లెల ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.