వనమాకు లాభమా..? నష్టమా..!?
* కొడుకు వ్యవహార శైలిపై విమర్శలు వెల్లువ
* ఆయన పోటీపై ప్రభావం చూపనున్నదా?
* గులాబీ క్యాడర్ లో రాఘవ తీరుపై గరం
* ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ పోరేంటి
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
వనమా రాఘవేందర్ రావు వ్యవహార శైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇతని తీరు వల్ల కొందరు గులాబీ అభిమానులు గరం గరం అవుతున్నారు. ఇప్పటికే రాఘవ చీదరింపు దురుసు ప్రవర్తన ప్రజల్లోకి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల్లోకి
వెళ్లిందని పలువురు ఓటర్లు బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు. వనమా వెంకటేశ్వరరావు కొడుకు రాఘవేంద్రరావుపై కడుపు మంటతో ఉన్నవారు కొత్తగూడెం అసెంబ్లీ బరిలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి
వనమా వెంకటేశ్వరరావుకు ఓట్ల రూపంలో లాభం జరుగుతుందా.. నష్టం జరుగుతుందన్న దానిపై కొత్తగూడెం పట్టణంలో విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఇటీవల అధికార పార్టీకి చెందిన మున్సిపల్ కౌన్సిలర్లపై రాఘవ నోరు పారేసుకున్న విషయం తెలిసింది. రాఘవ వేధింపులు తట్టుకోలేక కొంతమంది కౌన్సిలర్లు ఆయనకు దూరంగా దూరంగా ఉంటూ వనమా గెలుపుకై గట్టిగా కష్టపడుతూ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో కూడా రాఘవ తీరు మారకపోవడం పట్ల బీఆర్ఎస్ క్యాడర్ లోని కొందరు అసహనం వ్యక్తం చేయడం గమనార్హం. తండ్రి పోటీలో ఉన్నాడనే ఆలోచన రాఘవకు వస్తుందా రావడం లేదా అనే దానిపై కూడా విస్తృతంగా చర్చ సాగుతూ ఈ చర్చ ప్రస్తుతం కొత్తగూడెం టౌన్ లో హాట్ టాపిక్ గా మారింది. రాఘవ దూకుడుకి వనమా వెంకటేశ్వరరావు కున్న అభిమానులలో పలువురు వేరే దారులు వెతుక్కుంటున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో స్పష్టంగా అర్థం అవుతుందని రాజకీయ విశ్లేషకులు చర్చించుకోవడం గమనించాల్సిన విషయం. ఏది ఏమైనా రాఘవ వ్యవహార శైలి కొత్తగూడెం అసెంబ్లీ బరిలో ఉన్న భారత రాష్ట్ర సమితి అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావుకు లాభం చేకూరుతుందా.. నష్టం చేకూరుతుందా అన్నదానిపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో చర్చ నడుస్తుంది.