మన్యం న్యూస్ అశ్వాపురం:అశ్వాపురం మండలం రామచంద్రపురం గ్రామపంచాయతీ పరిధిలో గరివోడ్డు గ్రామంలో ఐటిసి ఎమ్మెస్ కే వాష్ ప్రోగ్రాం ఆధ్వర్యంలో వరల్డ్ టాయిలెట్ డే సోమవారం జరుపుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా వాష్ ప్రోగ్రాం సిబ్బంది మాట్లాడుతూ అందరూ కచ్చితంగా మరుగుదొడ్లని వాడుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలియజేశారు.వరల్డ్ టాయిలెట్ డే సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేసి ,స్కిట్టు రూపంలో ప్రజలకు అర్థమయ్యే మరుగుదొడ్ల ఉపయోగాన్ని వివరించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ కాక అశోక్,ఎమ్మెస్ ప్రోగ్రాం ఆఫీసర్ సుచిత్ర,వాష్ ప్రోగ్రాం పిఓ విజయ్,వాష్ ప్రోగ్రామ్ సిబ్బంది సునీల్ ,వెంకటేశ్వర్లు ,వెంకట్రావు,ముత్యాలరావు ప్రమోద్ ప్రసాదు జంపరాజు అపర్ణ ,రాజ్ కుమార్ కౌశిక్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.