మన్యం న్యూస్, మంగపేట.
మంగపేట మండలం రాజుపేట గ్రామ ఉన్నత పాఠశాల విద్యార్థులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు రావుల భాస్కరరావు, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య బలోపేతానికి ఎన్నిక లు కీలకమైనవి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మనకు నచ్చిన నాయకులను ఎన్నుకోవడం కోసం ప్రజలందరూ తమ బాధ్యతగా 100% ఓటింగ్ లో పాల్గొనాలని విద్యార్థి ప్రదర్శన ద్వారా సమాజానికి ఒక సూచనచేశారు.భారతదేశం యొక్క బంగారు భవిష్యత్తు ఎన్నికల ద్వారానే సాధ్యమైతుందని ప్రతి పౌరుడు విధిగా ఓటింగ్లో పాల్గొనాలని వారు అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు సీనియర్ ఉపాధ్యాయులు గడ్డం శ్రీనివాస్ బానోత్ బాలాజీ లక్ష్మీనారాయణ రాజ్యలక్ష్మి పావని సుజాత లావణ్య మహాదేవి ఆస్మా బేగం రాచమల్ల సురేందర్, వీర నారాయణ, జమున తదితరులు పాల్గొన్నారు.