UPDATES  

 మెచ్చా నాగేశ్వర రావు గెలుపు కొరకు డోర్ టూ డోర్ ప్రచారం నిర్వహించిన మండల నాయకులు..

  • మెచ్చా నాగేశ్వర రావు గెలుపు కొరకు డోర్ టూ డోర్ ప్రచారం నిర్వహించిన మండల నాయకులు
  • ప్రతి గడపకు బీఆర్ఎస్ మేనిఫెస్టో వివరిస్తున్న ఎంపీపీ జల్లిపల్లి
  • బీఅర్ఎస్ కు ఓటు వేయండి అభివృద్ధికి సహకరించండి వగ్గెల పూజ, భానోతు పద్మావతి

 

మన్యం న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 20: అశ్వారావుపేట మండల కేంద్రంలో సోమవారం నందమూరి కాలనీ, మెరుపు కాలనీ నందు డోర్ టూ డోర్ తిరుగుతూ అశ్వరావుపేట నియోజకవర్గం శాసనసభ్యులు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు మరియు సీఎం కెసిఆర్ గెలుపు కొరకు టౌన్ పార్టి ఆధ్వర్యంలో మండల నాయకులు డోర్ టూ డోర్ ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు బీఆర్ఎస్ మేనిఫెస్టోను మండల నాయకులు వివరించారు. కారు గుర్తుపై ఓటు వేయాలని, ప్రతీ గడపకు వెళ్ళి, ప్రతి ఒక్కరినీ ఓట్లు అడుగుతు మేనిఫెస్టో ఇచ్చి కారు గుర్తుపై ఓటు వేసి బీఅర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించాలని అశ్వారావుపేట ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి నియోజక వర్గ నాయకురాలు, వగ్గేల పూజ, భాణోతు పద్మావతి, జిల్లా అధికార పార్టీ ప్రతినిధి యుఎస్ ప్రకాష్ రావు, అశ్వారావుపేట టౌన్ పార్టి ప్రెసిడెంట్ సత్యవరపు సంపూర్ణ మండల నాయకులు, సంక ప్రసాద్, తాడేపల్లి రవి, సెట్టీపల్లి రఘురాం, లింగిసెట్టీ వెంకటేశ్వరరావు, త్రినాథ్, బోగవల్లి రాంబాబు, బుజ్జిబాబు, స్వామి మరియు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !