మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
సప్లిమెంటరీ ఈవియం ర్యాన్డమైజేషన్ ప్రక్రియను సోమవారం జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ డా ప్రియాంక అల పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాకు మొదటి విడత కేటాయించిన ఈవిఎంలకు అదనంగా 160 బ్యాలెట్ యూనిట్లు ఎన్నికల సంఘం కేటాయించినట్లు చెప్పారు. బ్యాలెట్ యూనిట్లును గోదాంలో భద్ర పరిచినట్లు చెప్పారు. ఈ సందర్భంగా సిసి కెమెరాలు పరిశీలించి తనిఖీ రిజిస్టర్ లో సంతకం చేశారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నుండి ఎం.ఏ రజాక్, కాంగ్రెస్ నుండి సంతోష్ కుమార్, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు దారా ప్రసాద్, ఎలక్షన్ సెల్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.