మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
తనను ఎన్నికల్లో గెలిపిస్తే ప్రగతిని మరింత పరుగులు పెట్టిస్తానని కొత్తగూడెం టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అనుమా వెంకటేశ్వరరావు ఓటర్లను అభ్యర్థించారు. ఈనెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బి ఆర్ ఎస్ తరఫున పోటీ చేస్తున్న తనకు ఓటేసి పట్టం కట్టాలని వనమా వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం పాల్వంచ మండల పరిధిలోని యానం బైలు, కిన్నెరసాని, పూసల తండా, కోడిపుంజుల వాగు, పుల్లాయి గూడెం, పునుకుల, బంజారా కాలనీ, కరకవాగు, సీతారాంపట్నం, ఎస్సీ కాలనీ, ప్రియదర్శిని కాలనీలలో విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచారాన్ని నిర్వహించేందుకు వెళ్లిన వనమా వెంకటేశ్వరరావుకు ప్రజలు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. డప్పు వాయిద్యాలు నృత్యాల మధ్య తోడుకొని వెళ్ళగా వివిధ ప్రాంతాలలో జరిగిన సభల్లో వనమా మాట్లాడారు. నియోజకవర్గ అభివృద్ధి అగొద్దోంటే బి ఆర్ ఎస్ గెలవాలన్నారు. ప్రగతిని గెలిపియాలని తద్వారా పల్లెలు మెరుస్తాయన్నారు. అభివృద్ధిని చూసి ఓటేయాలని పిలుపునిచ్చారు. ఈ ప్రచార కార్యక్రమాల్లో బి ఆర్ ఎస్ నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.