UPDATES  

 అక్రమంగా తరలిస్తున్న కలప పట్టివేత…..

 

 

మన్యం న్యూస్ దుమ్ముగూడెం నవంబర్ 20::

మండల పరిధిలోని బండిరేవు గ్రామంలో ఆటో ద్వారా అక్రమంగా తరలిస్తున్న టేకు కలపను స్వాధీనం చేసుకున్నట్లు అటవీశాఖ రేంజ్‌ అధికారిణి కనకమ్మ తెలిపారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం సోమవారం ఉదయం నమ్మదగిన సమాచారం నిమిత్తం 8 టేకు ముక్కలు పట్టుకున్నట్లు తెలిపారు. ఈ కలప ను తరలిస్తున్న రాళ్ల గూడెం గ్రామానికి చెందిన వ్యక్తి నరసింహ రావు పై కేసు నమోదు చేశారు. పట్టుకున్న కలపను అటవీశాఖ కార్యాలయానికి తరలించినట్టు వీటి విలువ 14 వేల రూపాయలు ఉంటుందని తెలిపారు. ఈ దాడుల్లో ఫారెస్ట్ అధికారులు శోభన్ నాయక్ వెంకట నరసమ్మ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !