మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
రైతు బంధు పథకం రాబందులపాలైందని ఎన్నికల్లో తనను గెలిపిస్తే అవినీతి లేని పాలన అందిస్తూ ప్రజలకు సేవ చేస్తానని కొత్తగూడెం నియోజకవర్గ సిపిఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు అన్నారు. సోమవారం శేషగిరి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కంకి కొడవలి గుర్తుపై ప్రజలు ఓట్లేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపాలని కోరారు. పథకాలలో ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు. ప్రజలను కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుతానని పేర్కొన్నారు. నా తుది శ్వాస వరకు కొత్తగూడెం అభివృద్ధికి పాటుపడతానని అన్నారు. దళిత సంఘాల ప్రతినిధి కూసపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్, సిపిఎం, టిడిపి, టీజేఎస్, ప్రజాపంద పార్టీలు బలపరుస్తున్న సిపిఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావుకు దళిత సంఘాలు మద్దతు తెలుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా, దళిత నాయకులు బందెల నరసయ్య, అంతోటి నాగేశ్వరరావు, మంద హనుమంతు, గిడ్ల పరంజ్యోతి, గుండా రమేష్, తుంపురు వీరస్వామి, భూపతి అశోక్, బొంకురి పరమేష్, సలిగంటి శ్రీనివాస్, బత్తుల సురేష్ తదితరులు పాల్గొన్నారు.