మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంకల మంగళవారం అనుబోస్ కళాశాలలో చేపట్టనున్న ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓట్ల లెక్కింపుకు చేపట్టాల్సిన కట్టదిట్టమైన చర్యలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు కౌంటింగ్ కేంద్రాల్లో ఐరన్ మెష్ ఏర్పాటు చేయాలని చెప్పారు. కేంద్రంలోకి వాహనాలకు అనుమతి లేదని ఆరుబయట నిర్దేశించిన ప్రదేశంలో వాహనాలు పార్కింగ్ చేయుటకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని, పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించి పరిశుభ్రంగా ఉంచాలని చెప్పారు. ఏర్పాట్లు పర్యవేక్షణకు ఆర్ అండ్ బి ఈఈ, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏ డి కుసుమ కుమారిలకు బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. 25 వరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి కేంద్రాన్ని అప్పగించాలని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఈ ఈ భీంలా, సర్వే ఏ డి.కుసుమ కుమారి తదితరులు పాల్గొన్నారు.