మన్యం న్యూస్ ,నూగురు వెంకటాపురం : మండల పరిధి వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ పరిధిలోని చొక్కాల గ్రామంలో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వాడబలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించి మత్స్యకారుల ఐక్యత వర్ధిల్లాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
వాడబలిజ సేవా సంఘం రాష్ట్ర యువ నాయకులు డర్ర దామోదర్ మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్రంలో ములుగు జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అత్యధికంగా వాడ బలిజ కులస్తులు గోదావరి పరివాహక ప్రాంతం ఇరువైపులా నివసిస్తున్నప్పటికీ ఏజెన్సీ ప్రాంతంలో స్వతంత్రం రాక ముందు నుండి వారి తాతలు ముత్తాతలు ఈ ప్రాంతంలో సాంప్రదాయ మత్స్యకారులుగా నివసిస్తున్నారు అని . వందలాది సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాడబలిజ కులస్తులు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండడం బాధాకరమని ఇకనైనా వాడబలజ కులస్తులను గుర్తించి ప్రభుత్వం ఇస్తున్నటువంటి
బీసీ బందులో వాడబలిజ కులస్తులకు చేర్చాలని
ఈ ప్రాంతంలో వాడబలిజ మత్స్యకారుల నిరుపేద పిల్లలకు ప్రతి మండలానికి వాడబలిజ మత్స్యకార గురుకులం ఏర్పాటు చేయాలని వారు కోరారు.
ఏజెన్సీ ప్రాంతంలోని చెరువులు కుంటలు గోదావరిలో వేసే చేప పిల్లల పెంపకంపై గిరిజన సోదరులతో సమానంగా సాంప్రదాయ మత్స్యకారులమైన మా వాడబలిజ కులస్తులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను కేటాయించాలని
ఏజెన్సీ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోస్టల్ ద్వారా ఇస్తున్నటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలను పొందేందుకు హక్కులు కల్పించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో
గ్రామ పెద్దలు కొప్పుల మల్లయ్య, సనుగొండ వెంకన్న, బొల్లె మల్లయ్య, వాదం వెంకన్న,
బద్ది రాంబాబు, నాగేంద్రబాబు, రవి, మల్లికార్జున్, శ్రావణ్, రాజు, సారయ్య, సమ్మయ్య, ఆదినారాయణ,రవిచంద్రమూర్తి, మల్లయ్య, రాము, నరసింహారావు, తదితర మహిళలు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.