మన్యంన్యూస్,ఇల్లందు:మున్సిపాలిటీ పరిధిలోని 19వ వార్డుకు చెందిన మాలోత్ కౌసల్య తీవ్రఅనారోగ్య సమస్యలతో సోమవారం మృతి చెందారు.కౌసల్య దహన సంస్కారాలకు సైతం ఆర్థికస్తోమత లేకపోవటంతో మన్యం విలేకరి శశికుమార్ ద్వారా విషయం తెలుసుకున్న ఇల్లందు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మడత వెంకట్ గౌడ్ రూ.5వేలు, శ్రీహరివాసం గ్రూప్ ఛైర్మెన్, బీఆర్ఎస్ పార్టీ పట్టణ ఉపాధ్యక్షులు పెండ్యాల హరికృష్ణ 2,500, ఆర్థిక సహాయాన్ని మంగళవారం ఉదయం వారి నివాసానికి చేరుకొని దహన సంస్కారాల నిమిత్తం మృతురాలి కుటుంబానికి అందజేసి మరోమారు వారి మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో సైదులు, సైదమ్మ, అంజి, మంగళ్ సింగ్, సునీల్, హరి, రాజేష్, మడత అనుచరులు తదితరులు పాల్గొన్నారు.