UPDATES  

 ఎలైట్ డీలర్ గా రజిత పతకం అందుకున్న నాసిరెడ్డి సాంబశివరెడ్డి ..స్పీక్ ఉత్పత్తులను రైతు ముంగిటకు తీసుకు వస్తా..

  • ఎలైట్ డీలర్ గా రజిత పతకం అందుకున్న నాసిరెడ్డి సాంబశివరెడ్డి
  • స్పీక్ ఉత్పత్తులను రైతు ముంగిటకు తీసుకు వస్తా.
  • తెలంగాణ స్టేట్ ఎలైట్ డీలర్ అవార్డు గ్రహీత సాంబశివరెడ్డి.

మన్యం న్యూస్, మంగపేట.

 

భారత ఎరువుల వ్యాపార దిగ్గజం స్పీక్ మరియు గ్రీన్ స్టార్ సంస్థలు సంయుక్తంగా మంగళ వారం హైదరాబాద్ ట్రేడెంట్ లో నిర్వహించిన తెలంగాణ స్టేట్ ఎలైట్ డీలర్స్ (తెలంగాణ రాష్ట్ర ఉన్నత ఎరువుల వ్యాపారుల) సమావేశానికి ములుగు జిల్లా మంగపేట మండలం అకినేపల్లి మల్లారం గ్రామానికి చెందిన జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ మెంబర్ మరియు వికాస్ ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ సీడ్స్ ప్రొప్రైటర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి హాజరయ్యారు.ఈ మేరకు ఆయన స్పీక్ మరియు గ్రీన్ స్టార్ మార్కెటింగ్ డైరెక్టర్ ఎస్ నారాయణన్ చేతుల మీదగా, సౌత్ మార్కెటింగ్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎస్ రఘునాధ్ రెడ్డి జోనల్ మేనేజర్ ఎస్ ఎస్ గడాచి తెలంగాణ స్టేట్ మార్కెటింగ్ మేనేజర్ కే సత్యనారాయణ మరియు యాజమాన్యం ఉన్నతాధికారుల సమక్షంలో ఎలైట్ డీలర్ గా రాష్ట్రస్థాయిలో రజిత పతకం అందుకున్నారు. ఈ సందర్భంగా సాంబశివరెడ్డి మాట్లాడుతూ గడచిన రెండు దశాబ్దాలుగా వ్యవసాయ రంగంలో తాను చేసిన సేవల ఫలితంగా తనకు ఎలైట్ డీలర్ గా అరుదైన గౌరవం గుర్తింపు లభించిందని అన్నారు.విలువలతో కూడిన వ్యాపారానికి ప్రాధాన్యత ఇవ్వడం స్పీక్ మరియు గ్రీన్ స్టార్ సంస్థలు రైతుల కోసం అందిస్తున్న సూక్ష్మ ఎరువులు, సూటి ఎరువుల ఉత్పత్తులను రైతుల దరి చేర్చడం, అంతేకాకుండా రైతుల కోసం స్పిక్ మరియు గ్రీన్ స్టార్ సంస్థలు అమలు చేస్తున్న వివిధ పథకాలను ప్రోత్సాహకాలను రైతులకు అందజేయడంలో వికాస్ ఫెర్టిలైజర్స్ ప్రథమ స్థానంలో ఉండి ఎలైట్ డీలర్ అవార్డును సాధించటం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ములుగు జిల్లా నుండి తనకు ఎలైట్ డీలర్ గా రజిత పతకం అవార్డు లభించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.వచ్చే వేసంగి సీజన్ నుండి స్పీక్ మరియు గ్రీన్ స్టార్ సంస్థల నుండి రైతుల అభ్యున్నతి కోసం అమలు చేస్తున్న వివిధ ఉత్పత్తులను పథకాలను ప్రోత్సాహకాలను మరియు కార్యక్రమాలను పెద్ద ఎత్తున అమలు చేసి రైతుల చెంతకు చేరుస్తామని సాంబశివరెడ్డి తెలియజేశారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !